Breaking News

సీఎస్‌కే స్టార్ ఓపెనర్ ఇంట తీవ్ర విషాదం..

Published on Mon, 04/21/2025 - 22:35

న్యూజిలాండ్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ స్టార్ ఓపెన‌ర్ డెవాన్ కాన్వే ఇంట తీవ్ర విషాదం నెల‌కొంది. అత‌డి తండ్రి డెంటాన్ క‌న్నుమూశారు. ఈ విష‌యాన్ని సీఎస్‌కే అధికారికంగా ధ్రువీక‌రించింది. "ఈ క్లిష్ట స‌మ‌యంలో  కాన్వే కుటుంబానికి మద్దతుగా ఉంటాము. డెంటాన్ మృతికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము" అని సీఎస్‌కే యాజ‌మాన్యం ఎక్స్‌లో రాసుకొచ్చింది. 

కాగా కాన్వే తండ్రి మృతికి సంతాపంగా ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే ఆటగాళ్లు నల్లటి బ్యాండ్‌లు ధరించి మైదానంలో దిగారు. కాగా కాన్వే ఇప్పటికే న్యూజిలాండ్‌కు చేరుకున్నాడు. అతడు ఈ ఏడాది ఐపీఎల్‌లో చివరగా ఏప్రిల్ 11న సీఎస్‌కే తరపున ఆడాడు.

దక్షిణాఫ్రికాకు చెందిన డెంటాన్ కాన్వే కుటంబం.. డెవాన్ కాన్వే చిన్నతనంలో న్యూజిలాండ్‌కు మకాం మార్చారు. ఈ క్రమంలోనే కాన్వే దేశవాళీ టోర్నీల్లో అద్భుతంగా ప్రదర్శన చేసి కివీస్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అతి తక్కువ కాలంలోనే బ్లాక్‌క్యాప్స్ జట్టులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 

ఐపీఎల్‌-2025లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన డెవాన్‌.. 27.03 స్ట్రైక్ రేట్‌తో 94 పరుగులు చేశాడు.  కాన్వే తిరిగి రావడం‍పై మాత్రం సీఎస్‌కే ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇక ఈ ఏడాది సీజన్‌లో సీఎస్‌కే దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. చెన్నై జట్టు ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి కేవలం రెండింట మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానంలో కొనసాగుతోంది.

Videos

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)