Breaking News

IPL 2025: ఆ ఓవర్‌ స్టబ్స్‌కు ఎందుకు ఇచ్చావని ఇప్పుడు ఎవరూ నన్ను తిట్టరు: అక్షర్‌

Published on Tue, 03/25/2025 - 10:18

ఐపీఎల్‌ 2025లో భాగంగా నిన్న (మార్చి 24) జరిగిన రసవత్తర సమరంలో లక్నో సూపర్‌ జెయింట్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ పరుగు తేడాతో గెలిచింది. లక్నో నిర్దేశించిన భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ ఆదిలో తడబడినా చివరికి విజయం సాధించింది. ఆశుతోష్‌ శర్మ (31 బంతుల్లో 66 నాటౌట్‌; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), విప్రాజ్‌ నిగమ్‌ (15 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్‌లు ఆడి ఢిల్లీని గెలిపించారు.

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో.. మిచెల్‌ మార్ష్‌ (36 బంతుల్లో 72; 6 ఫోర్లు, 6 సిక్సర్లు), నికోలస్‌ పూరన్‌ (30 బంతుల్లో 75; 6 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో 65 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఢిల్లీని అశుతోష్‌.. ట్రిస్టన్‌ స్టబ్స్‌ (22 బంతుల్లో 34; ఫోర్‌, 3 సిక్సర్లు), విప్రాజ్‌ నిగమ్‌ సాయంతో గెలిపించాడు. 

అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఢిల్లీకి చివరి ఓవర్‌లో గెలుపుకు 6 పరుగులు కావాలి. తొలి బంతికి లక్నో కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ మోహిత్‌ శర్మ స్టంపింగ్‌ను మిస్‌ చేశాడు. దీంతో ఊపిరిపీల్చుకున్న ఢిల్లీ ఆ తర్వాత మూడో బంతిని అశుతోష్‌ సిక్సర్‌గా మలచడంతో సంబరాలు చేసుకుంది. ఐపీఎల్‌లో ఇంత భారీ లక్ష్యాన్ని (210) ఛేదించడం ఢిల్లీకి ఇదే మొదటిసారి. ఐపీఎల్‌లో ఓ జట్టు లక్నోపై 200 ప్లస్‌ టార్గెట్‌ను ఛేదించడం​ కూడా ఇదే మొదటిసారి.

మ్యాచ్‌ అనంతరం​ విన్నింగ్‌ కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌ మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఎందుకో తెలీదు నా కెప్టెన్సీలోనే ఇలా జరుగుతుంది. పరిస్థితులు అప్‌ అండ్‌ డౌన్‌గా ఉంటాయి. మొత్తానికి మేం గెలిచాం. ఇప్పుడు ఆ ఓవర్ స్టబ్స్‌కి ఎందుకు ఇచ్చావని జనాలు నన్ను తిట్టరు. చివరిసారిగా ఇలాంటి ఉత్కంఠభరితమైన మ్యాచ్‌ ఎప్పుడు చూశానో గుర్తులేదు.

మొదటి ఆరు ఓవర్లలో వాళ్ళు (మార్ష్‌, పూరన్‌) ఆడిన తీరు చూస్తే ఈజీగా 240 పైచిలుకు పరుగులు సాధిస్తారని అనుకున్నా. మా బౌలర్లు చాలా ఎక్కువ పరుగులు ఇచ్చారని అనిపించింది. మొదట్లో మేము కొన్ని క్యాచ్‌లు కూడా వదిలేశాము. అయినా తిరిగి ఆటలోకి రాగలిగాము. విప్రాజ్‌ సామర్థ్యం గురించి మాకు ముందే తెలుసు.

కాగా, ఈ మ్యాచ్‌లో అక్షర్‌ ట్రిస్టన్‌ స్టబ్స్‌తో 13వ ఓవర్‌ వేయించాడు. అప్పటికే శివాలెత్తిపోయిన పూరన్‌ స్టబ్స్‌ బౌలింగ్‌లో మరింత రెచ్చిపోయి వరుసగా నాలుగు సిక్సర్లు, బౌండరీ సహా 28 పరుగులు పిండుకున్నాడు. అక్షర్‌ ఆ సమయంలో స్టబ్స్‌తో ఎందుకు బౌలింగ్‌ చేయించాడో ఎవరికీ అర్దం కాలేదు.

 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)