Breaking News

IPL 2025: రాజస్థాన్‌ రాయల్స్‌ హోం గ్రౌండ్‌కు బాంబు బెదిరింపు

Published on Thu, 05/08/2025 - 17:05

'అపరేషన్‌ సిందూర్‌' తర్వాత భారత్‌, పాక్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్‌ 2025 సజావుగా కొనసాగడం అనుమానంగా మారింది. షెడ్యూల్‌ ప్రకారం లీగ్‌ కొనసాగుతుందని బీసీసీఐ, ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ చెబుతున్నా.. అభిమానుల్లో ఏదో తెలీని గందరగోళం నెలకొంది. షెడ్యూల్‌ ప్రకారం మ్యాచ్‌లు జరగాలంటే జట్లు వేర్వేరు వేదికలు తిరుగుతూ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. 

అయితే పాక్‌ దాడులకు పాల్పడవచ్చన్న అనుమానంతో భారత ప్రభుత్వం దేశంలో పలు విమానాశ్రయాలను మూసి వేయించింది. ఇందులో ఐపీఎల్‌ మ్యాచ్‌లకు వేదికలైన చండీఘడ్‌, ధర్మశాల ఉన్నాయి. ఈ క్రమంలో మే 11న ధర్మశాలలో జరగాల్సిన పంజాబ్‌, ముంబై ఇండియన్స్‌ మ్యాచ్‌ అహ్మదాబాద్‌కు షిఫ్ట్‌ అయ్యింది.

తాజాగా ఓ వార్త ఐపీఎల్‌ వర్గాల్లో కలకలం రేపుతుంది. మే 16న జైపూర్‌లోని సువాయ్‌ మాన్‌ సింగ్‌ స్టేడియంలో జరగాల్సిన పంజాబ్‌, రాజస్థాన్‌ మ్యాచ్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. సువాయ్‌ మాన్‌ సింగ్‌ స్టేడియంను పేల్చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఈ మెయిల్‌ ద్వారా బెదిరింపులకు దిగారు. ఈ ఈ-మెయిల్‌ ఇవాళ (మే 8) ఉదయం 9:13 గంటల సమయంలో వచ్చింది. 

వెంటనే అలర్ట్‌ అయిన రాజస్థాన్‌ స్పోర్ట్స్‌ కౌన్సిల్‌ పోలీసులకు సమాచారం అందించింది. రంగంలోకి దిగిన పోలీసులు స్టేడియంను ఖాళీ చేయించారు. బాంబు స్క్వాడ్‌లు, తనిఖీ యూనిట్లతో స్టేడియంను జల్లెడ పట్టారు. స్టేడియంలో ఎలాంటి బాంబు లేదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

కాగా, నిన్న కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌కు కూడా ఇలాంటి బెదిరింపు ఈ-మెయిల్‌ వచ్చింది. స్టేడియంను పేల్చి వేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు దిగారు. అయితే పోలీసులు వెంటనే అలర్టై మ్యాచ్‌ను సజావుగా సాగేలా చూశారు. నిన్న ఈడెన్‌ గార్డెన్‌లో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌, సీఎస్‌కే తలపడ్డాయి. వరుసగా రెండు రోజులు ఐపీఎల్‌ వేదికలకు బాంబు బెదిరింపులు రావడాన్ని ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సీరియస్‌గా తీసుకుంది. మ్యాచ్‌లకు ఎలాంటి ఆటంకం కలగకుండా సజావుగా సాగేందుకు చర్యలు తీసుకుంది.

మరోవైపు భారత దళాలు పాక్‌లోని రావల్పిండి స్టేడియంపై చేసిన డ్రోన్‌ దాడి కారణంగా పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. లీగ్‌లో భాగంగా ఇవాళ బాబర్‌ ఆజం కెప్టెన్సీలోని పెషావర్‌ జల్మీ- డేవిడ్‌ వార్నర్‌ సారథ్యంలోని కరాచీ కింగ్స్‌ మధ్య మ్యాచ్‌ జరగాల్సి ఉంది. డ్రోన్‌ దాడి నేపథ్యంలో ఈ మ్యాచ్‌ రద్దయ్యే అవకాశం ఉంది. పాక్‌ క్రికెట్‌ బోర్డు క్రికెటర్లను రావల్పిండి విడిచి వెళ్లిపోవాలని ఆదేశించినట్లు తెలుస్తుంది.

కాగా, పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి బదులుగా భారత్‌  'ఆపరేషన్‌ సిందూర్'‌ చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో భారత దళాలు పాక్‌ ఉ‍గ్రవాద స్థావరాలే లక్ష్యంగా మెరుపు దాడులు చేస్తున్నాయి. మంగళవారం జరిగిన దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారని తెలుస్తుంది. ఆపరేషన్‌ సిందూర్‌ ఇంకా కొనసాగుతూ ఉంది. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)