CSK Vs DC: అప్పుడు సెహ్వాగ్‌.. ఇప్పుడు అక్షర్‌

Published on Sun, 04/06/2025 - 14:48

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ సీజన్‌లో ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచి ఏకైక అజేయ జట్టుగా నిలిచింది. గడిచిన 16 సీజన్లలో ఢిల్లీ ఆడిన తొలి మూడు మ్యాచ్‌లు గెలవడం ఇదే తొలిసారి. 2009 సీజన్‌లో ఆ జట్టు వీరేంద్ర సెహ్వాగ్‌ నేతృత్వంలో వరుసగా తొలి మూడు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. తాజాగా సెహ్వాగ్‌ రికార్డును అక్షర్‌ సమం చేశాడు. 

ఈ సీజన్‌తోనే ఢిల్లీ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన అక్షర్‌ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో తన జట్టుకు తిరుగులేని విజయాలను అందించాడు. 15 ఏళ్ల తర్వాత ఢిల్లీ చెన్నై సూపర్‌ కింగ్స్‌ను వారి అడ్డాలో (చెపాక్‌ స్టేడియం) ఓడించింది. ఢిల్లీ ఫ్రాంచైజీ చరిత్రలో అక్షర్‌కు ముందు సెహ్వాగ్‌ (2008), గంభీర్‌ (2010) మాత్రమే సీఎస్‌కేను వారి సొంత మైదానంలో ఓడించారు. నిన్న (ఏప్రిల్‌ 5) మధ్యాహ్నం చెపాక్‌లో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ సీఎస్‌కేను 25 పరుగుల తేడాతో ఓడించింది.

కేఎల్‌ రాహుల్‌ బాధ్యతాయుతమైన హాఫ్‌ సెంచరీతో ఢిల్లీ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఛేదనలో సీఎస్‌కే తడబడింది. ఢిల్లీ నిర్దేశించిన 184 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలబడింది. ధోని జిడ్డు బ్యాటింగ్‌తో (26 బంతుల్లో 30; ఫోర్‌, సిక్స్‌) సీఎస్‌కే విజయావకాశలను దెబ్బ తీశాడు. మరో ఎండ్‌లో త్రీడి ప్లేయర్‌ విజయ్‌ శంకర్‌ (54 బంతుల్లో 69 నాటౌట్‌; 5 ఫోర్లు, సిక్స్‌) కూడా నిదానంగా ఆడి సీఎస్‌కే పరాజయానికి కారకుడయ్యాడు. 

ఢిల్లీ బ్యాటర్లలో జేక్‌ ఫ్రేజర్‌ డకౌట్‌ కాగా.. అభిషేక్‌ పోరెల్‌ 33, అక్షర్‌ పటేల్‌ 21, సమీర్‌ రిజ్వి 20, ట్రిస్టన్‌ స్టబ్స్‌ 24 (నాటౌట్‌), అశోతోష్‌ శర్మ 1, విప్రాజ్‌ నిగమ్‌ 1 (నాటౌట్‌) పరుగులు చేశారు.సీఎస్‌కే బౌలర్లలో ఖలీల్‌ అహ్మద్‌ పొదుపుగా బౌలింగ్‌ చేసి 2 వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా, నూర్‌ అహ్మద్‌, మతీశ పతిరణ తలో వికెట్‌ పడగొట్టారు. 

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే 74 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమి బాటలో నడిచింది. ఈ దశలో విజయ్‌ శంకర్‌, ధోని గెలుపు ప్రయత్నాలు ఏమాత్రం చేయకుండా వికెట్‌ కాపాడుకునే పని పడ్డారు. ధోని ఏకంగా 18 బంతుల తర్వాత తన తొలి సిక్సర్‌ను కొట్టాడు. విజయ్‌ శంకర్‌ ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లోనే అతి నిదానమైన హాఫ్‌ సెంచరీ (43 బంతుల్లో) చేశాడు. 

చివర్లో విజయ్‌ శంకర్‌ ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ మ్యాచ్‌లో చెత్తగా ఆడిన ధోనిని సొంత అభిమానులు సైతం విసుక్కున్నారు. ధోని ఇక తప్పుకోవడం మంచిదని అభిప్రాయపడుతున్నారు. 

ఢిల్లీ బౌలర్లలో  మిచెల్‌ స్టార్క్‌ (4-0-27-1), విప్రాజ్‌ నిగమ్‌ (4-0-27-2) అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. ముకేశ్‌ కుమార్‌, కుల్దీప్‌ తలో వికెట్‌ తీసి పర్వాలేదనిపించారు. సీఎస్‌కే బ్యాటర్లలో రచిన్‌ రవీంద్ర 3, డెవాన్‌ కాన్వే 13, రుతురాజ్‌ 5, శివమ్‌ దూబే 18, రవీంద్ర జడేజా 2 పరుగులు చేశారు. 

ఈ ఓటమితో సీఎస్‌కే ఖాతాలో హ్యాట్రిక్‌ పరాజయాలు చేరాయి. తమ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై గెలుపొందిన ఈ జట్టు ఆతర్వాత వరుసగా ఆర్సీబీ, రాజస్థాన్‌ రాయల్స్‌, ఢిల్లీ చేతుల్లో ఓడింది. మరోవైపు అక్షర్‌ నేతృత్వంలోని ఢిల్లీ వరుసగా లక్నో, సన్‌రైజర్స్‌, సీఎస్‌కేపై విజయాలు సాధించింది. ఢిల్లీ తమ తదుపరి మ్యాచ్‌లో ఆర్సీబీతో (ఏప్రిల్‌ 10) తలపడనుండగా.. సీఎస్‌కే పంజాబ్‌ కింగ్స్‌ను (ఏప్రిల్‌ 8) ఢీకొట్టనుంది. 

Videos

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)