Breaking News

IPL 2025: రాయల్స్‌ చేతిలో పరాజయం.. సెంచరీ కొట్టిన సీఎస్‌కే

Published on Mon, 03/31/2025 - 13:26

ఐపీఎల్‌లో ఫైవ్‌ టైమ్‌ ఛాంపియన్స్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ పరాజయాల సెంచరీని పూర్తి చేసుకుంది. రాజస్థాన్‌ రాయల్స్‌ చేతిలో ఓటమితో సీఎస్‌కే ఈ ల్యాండ్‌ మార్కును తాకింది. తద్వారా ఐపీఎల్‌లో 100 పరాజయాలు పూర్తి చేసుకున్న ఏడో జట్టుగా నిలిచింది. సీఎస్‌కేకు ముందు ఢిల్లీ (134), పంజాబ్‌ (133), ఆర్సీబీ (128), కేకేఆర్‌ (118), ముంబై ఇండియన్స్‌ (117), రాజస్థాన్‌ రాయల్స్‌ (108) 100 పరాజయాల మార్కును తాకాయి. 

మధ్యలో రెండు సీజన్లు మినహా ఐపీఎల్‌ మొత్తంలో పాల్గొన్న సీఎస్‌కే ఇప్పటివరకు 242 మ్యాచ్‌లు ఆడి 139 విజయాలు, 100 పరాజయాలను ఎదుర్కొంది. ఐపీఎల్‌లో అత్యధిక విజయాలు సాధించిన జట్ల జాబితాలో సీఎస్‌కే రెండో స్థానంలో ఉంది. ముంబై (142) టాప్‌లో ఉండగా.. సీఎస్‌కే (139), కేకేఆర్‌ (131), ఆర్సీబీ (123), ఢిల్లీ (114), రాజస్థాన్‌ (111), పంజాబ్‌ (110) వరుస స్థానాల్లో ఉన్నాయి.

కాగా, ఐపీఎల్‌-2025లో భాగంగా నిన్న (మార్చి 30) రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 6 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ గెలిచిన ఆ జట్టుకు ఇది వరుసగా రెండో ఓటమి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్‌.. నితీశ్‌ రాణా (36 బంతుల్లో 81; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) విజృంభించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. 

రాయల్స్‌ ఇన్నింగ్స్‌లో నితీశ్‌తో పాటు శాంసన్‌ (16 బంతుల్లో 20; ఫోర్‌, సిక్స్‌), రియాన్‌ పరాగ్‌ (28 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), హెట్‌మైర్‌ (16 బంతుల్లో 19; ఫోర్‌, సిక్స్‌) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. సీఎస్‌కే బౌలర్లలో నూర్‌ అహ్మద్‌ (4-0-28-2), పతిరణ (4-0-28-2), ఖలీల్‌ అహ్మద్‌ (4-0-38-2) అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. జడ్డూ, అశ్విన్‌ తలో వికెట్‌ తీశారు.

అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన సీఎస్‌కే.. రుతురాజ్‌ (44 బంతుల్లో 63; 7 ఫోర్లు, సిక్స్‌), జడేజా (22 బంతుల్లో 32 నాటౌట్‌; 2 ఫోర్లు, సిక్స్‌), ధోని (11 బంతుల్లో 16; ఫోర్‌, సిక్స్‌) పోరాడినా లక్ష్యానికి 7 పరుగుల దూరంలో నిలిచిపోయింది. రాయల్స్‌ బౌలర్లలో హసరంగ (4-0-35-4), ఆర్చర్‌ (3-1-13-1) అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. చివరి ఓవర్‌లో సీఎస్‌కే గెలుపుకు అవసరం కాగా.. సందీప్‌ శర్మ 13 పరుగులకే ఇచ్చి రాయల్స్‌కు ఈ సీజన్‌లో తొలి గెలుపును అందించాడు.

 

Videos

ఎక్కడ దాక్కున్నావ్ లోకేష్.. కొండారెడ్డి బురుజుకు ఇప్పుడురా..

సరదాకు ఉద్యమాలు చేయడం లేదు.. ఇంకెంతకాలం సాగదీస్తావ్ చంద్రబాబు

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Russia Ukraine War : పుతిన్ ఆఫర్..యుద్ధం ముగిసేనా..?

స్టాక్ మార్కెట్ లో కోట్లు, మోహ్నిష్ పాబ్రాయ్ షాకింగ్ స్టాటజీ

లోకేష్ రాజీనామా చేయాలి

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు