Breaking News

IPL 2025- CSK: ధోనికి రూ. 4 కోట్లు! వాళ్లిద్దరూ జట్టుతోనే!

Published on Sun, 10/20/2024 - 19:29

ఐపీఎల్‌-2025 మెగా వేలానికి ఫ్రాంఛైజీలు సన్నద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా ఈనెల (అక్టోబరు) 31 నాటికి.. అట్టిపెట్టకునే ఆటగాళ్ల తుదిజాబితాను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే) రిటెన్షన్స్‌కు సంబంధించి ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది.

కాగా ఐపీఎల్‌ పాలక మండలి రిటెన్షన్‌ విధానంలో భాగంగా కొత్త నిబంధనలు తెచ్చిన విషయం తెలిసిందే. ఈసారి ఫ్రాంఛైజీలు గరిష్టంగా ఆరుగురు(ఆర్‌టీఎమ్‌) ఆటగాళ్లను అట్టిపెట్టుకునే అవకాశం ఉంది. ఇందులో రిటెన్షన్‌ స్లాబ్‌లో మొదటి ఆటగాడికిరూ. 18 కోట్లు, రెండో ప్లేయర్‌కు రూ. 14 కోట్లు, మూడో క్రికెటర్‌కు రూ. 18 కోట్లు, నాలుగో ఆటగాడికి రూ. 14 కోట్లు, ఐదో ఆటగాడికి రూ. 11 కోట్లు, ఆరో ఆటగాడికి రూ. 4 కోట్లు(అన్‌క్యాప్డ్‌) చెల్లించాల్సి ఉంటుంది.

సీఎస్‌కే రిటైన్‌ చేసుకునేది వీరినే? ఎవరికి ఎన్ని కోట్లు
ఇక తాజా సమాచారం ప్రకారం సీఎస్‌కే తమ టాప్‌ ప్లేయర్‌ మహేంద్ర సింగ్‌ ధోని, కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌లతో పాటు రవీంద్ర జడేజా, శివం దూబే, మతీశ పతిరణలను రిటైన్‌ చేసుకోవాలని ఫిక్సయినట్లు తెలుస్తోంది. ఇందులో ధోనిని అన్‌క్యాప్డ్‌ కోటాలో ఎంపిక చేసుకుని రూ. 4 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమైన ఫ్రాంఛైజీ.. రుతుతో పాటు జడ్డూకు రూ. 18 కోట్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

అంతేకాదు.. రుతురాజ్‌నే కెప్టెన్‌గా కొనసాగించాలని నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా 2008లో ఐపీఎల్‌ ఆరంభమైన నాటి నుంచి ధోని చెన్నై ఫ్రాంఛైజీతోనే కొనసాగుతున్నాడు. జట్టును అత్యధికంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపి ఈ ఘనత సాధించిన రెండో కెప్టెన్‌గా రికార్డులకెక్కాడు. అయితే, గతేడాది సారథ్య బాధ్యతలను రుతురాజ్‌ గైక్వాడ్‌కు అప్పగించిన ధోని ఆటగాడిగా కొనసాగాడు.

సీఎస్‌కే అంటే ధోని
నిజానికి ధోని అంటే సీఎస్‌కే.. సీఎస్‌కే అంటే ధోని. ధోని బ్రాండ్‌ వల్లే చెన్నై ఫ్రాంఛైజీకి ఆదరణ పెరుగిందనేద కాదనలేని వాస్తవం. అంతేకాదు.. వేలం మొదలు కెప్టెన్సీ వరకు ధోని ఆజ్ఞ లేనిదే అక్కడ ఏ పని జరగదని సన్నిహిత వర్గాలు అంటాయి. మరి అలాంటి ధోని అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా ఎలా? అంటే.. బీసీసీఐ నిబంధన ప్రకారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత ఆటగాళ్లను ఫ్రాంఛైజీలో ఈ కోటాలో వేసుకోవచ్చు.

PC: BCCI
ఇద్దరు శిష్యులు
చెన్నైకి రుతుతో పాటు జడేజా కూడా ముఖ్యం కాబట్టి వాళ్లిద్దరికి రూ. 18 కోట్లు ఇవ్వాలని భావిస్తున్నట్లు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా నివేదిక పేర్కొంది. కాగా రుతురాజ​ 2019లో సీఎస్‌కేలో చేరాడు. 2020లో అరంగేట్రం చేసిన అతడు ఆ మరుసటి ఏడాదే ఆరెంజ్‌క్యాప్‌ హోల్డర్‌ అయ్యాడు. ఆసియా క్రీడలు-2023లో భారత ద్వితీయ శ్రేణి జట్టుకు సారథ్యం వహించి గోల్డ్‌ మెడల్‌ గెలిచిన తర్వాత.. ఈఏడాది సీఎస్‌కే పగ్గాలు చేపట్టాడు.

ఇక రవీంద్ర జడేజాకు సీఎస్‌కేతో సుదీర్ఘ అనుబంధం ఉంది. 2022లో కెప్టెన్‌గానూ నియమితుడయ్యాడు. కానీ వరుస ఓటముల నేపథ్యంలో మధ్యలోనే కెప్టెన్సీ వదిలేశాడు. ఈ ఇద్దరికి వరుస అవకాశాలు ఇచ్చి జట్టులో కీలక సభ్యులుగా నిలబెట్టింది మాత్రం ధోనినే!

చదవండి: Ind vs NZ: టీమిండియాలోకి చెన్నై చిన్నోడు.. బీసీసీఐ ప్రకటన

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)