ప్రపంచ రికార్డు ముంగిట యజువేంద్ర చహల్‌

Published on Sat, 04/13/2024 - 13:56

ఐపీఎల్‌-2024లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. చంఢీగఢ్‌లోని ముల్లన్‌పూర్‌ వేదికగా పంజాబ్‌ కింగ్స్‌- రాజస్తాన్‌ రాయల్స్‌తో తలపడనుంది.  ఇరు జట్ల మధ్య శనివారం మ్యాచ్‌ జరుగనుంది.

ఇక వరుసగా నాలుగు విజయాల తర్వాత గుజరాత్‌ టైటాన్స్‌ చేతిలో ఓటమి రుచి చూసిన రాజస్తాన్‌.. తిరిగి విజయాల బాట పట్టాలని పట్టుదలగా ఉండగా.. వరుస పరాజయాలతో చతికిలపడ్డ పంజాబ్‌ సొంత మైదానంలో సత్తా చాటాలని ఉవ్విళూర్లుతోంది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య పోరు మరింత రసవత్తరంగా మారనుంది.

ఇక పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌ నేపథ్యంలో రాజస్తాన్‌ రాయల్స్‌ స్టార్‌ స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ ప్రపంచ రికార్డు ముంగిట నిలిచాడు. ఈ మ్యాచ్‌లో గనుక అతడు మూడు వికెట్లు తీస్తే ఐపీఎల్‌ చరిత్రలో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టిస్తాడు.

చహల్‌ ఇప్పటి వరకు 157 ఐపీఎల్‌ మ్యాచ్‌లలో కలిపి 197 వికెట్లు పడగొట్టాడు. కాగా ముంబై ఇండియన్స్‌ ద్వారా 2011లో ఐపీఎల్‌లో అడుగుపెట్టిన ఈ మణికట్టు స్పిన్నర్‌.. 2014 నుంచి రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు సుదీర్ఘకాలం పాటు ఆడాడు.

అయితే, 2022 మెగా వేలానికి ముందు ఆర్సీబీ చహల్‌ను విడుదల చేయగా.. రాజస్తాన్‌ రాయల్స్‌ సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం ఐపీఎల్‌-2024లో రాజస్తాన్‌ తరఫున ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన చహల్‌ 10 వికెట్లు పడగొట్టాడు. 

ఇదిలా ఉంటే.. పంజాబ్‌ కింగ్స్‌పై యజువేంద్ర చహల్‌కు మంచి రికార్డు ఉంది. ఇప్పటి వరకు ఆ జట్టుతో 19 మ్యాచ్‌లు ఆడిన చహల్‌ 29 వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. క్యాష్‌ రిచ్‌ లీగ్‌ పదిహేడో ఎడిషన్‌లో సత్తా చాటి టీ20 ప్రపంచకప్‌-2024 ఆడే భారత జట్టులో చోటు దక్కించుకోవాలని చహల్‌ పట్టుదలగా ఉన్నాడు.

ఇక రాజస్తాన్‌ రాయల్స్‌ ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో నాలుగు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. పంజాబ్‌ కింగ్స్‌ ఐదింట కేవలం రెండు మాత్రమే గెలిచి ఎనిమిదో స్థానంలో ఉంది.

చదవండి: గైక్వాడ్‌ ఈ ఒక్క ఏడాదే.. వచ్చే సీజన్‌లో CSK కెప్టెన్‌ అతడే!

Videos

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)