Breaking News

IPL 2024: ఐపీఎల్‌ చరిత్రలో తొలిసారి ఇలా..!

Published on Fri, 03/22/2024 - 15:34

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో మరో ముందడుగు పడింది. క్యాష్‌ రిచ్‌ లీగ్‌ చరిత్రలో తొలిసారి చెవిటి, దృష్టి లోపం ఉన్న అభిమానుల కోసం సంకేత భాష మరియు వివరణాత్మక వ్యాఖ్యానాన్ని అందించనున్నారు. చెవిటి, దృష్టి లోపం ఉన్న అభిమానుల సౌకర్యార్దం స్టార్‌ స్పోర్ట్స్‌ ఛానల్‌ ఈ నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఐపీఎల్‌ 2024 సీజన్‌ తొలి మ్యాచ్‌ నుంచి ఈ తరహా వ్యాఖ్యానం​ అమల్లోకి రానుంది. 

ఈ నూతన ఒరవడిని అమల్లో పెట్టేందుకు ఐపీఎల్‌ అధికారిక ప్రసారకర్త అయిన స్టార్‌ స్పోర్ట్స్‌ ఇండియా సైనింగ్ హ్యాండ్స్ (ISH) న్యూస్‌తో చేతులు కలిపింది. ఐఎస్‌హెడ్‌ నిపుణుల ఆధ్వర్యంలో ఫీడ్‌ను భారతీయ సంకేత భాషను ఉపయోగించి బాల్ టు బాల్ అప్‌డేట్స్‌ ఇస్తామని స్టార్‌ స్పోర్ట్స్‌ వెల్లడించింది. సంకేత బాష ఫీడ్‌తో పాటు సాధారణ వెర్బల్ స్కోర్ అప్‌డేట్స్‌ కూడా ఉంటాయని పేర్కొంది. ఈ వెసులుబాటుతో చెవిటి, దృష్టి లోపం ఉన్న క్రికెట్‌ అభిమానులు గేమ్‌లోని ప్రతి క్షణాన్ని ఆస్వాధిస్తారని విశ్వాసం వ్యక్తం చేసింది. 

ఇదిలా ఉంటే, ఇవాల్టి నుంచి ఐపీఎల్‌ 2024 సీజన్‌ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. చెన్నైలోని చెపాక్‌ వేదికగా జరిగే సీజన్‌ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్ సీఎస్‌కే.. ఆర్సీబీతో తలపడనుంది. ఈ మ్యాచ్‌ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)