#MIvsGT: సూపర్‌ టాలెంట్‌.. బుమ్రాకు మాత్రమే సాధ్యం! వీడియో

Published on Mon, 03/25/2024 - 13:56

#MIvGT- JASPRIT BUMRAH Super Spell Video: గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా అదరగొట్టాడు. మ్యాచ్‌ ఫలితం ఎలా ఉన్నా ఈ పేస్‌ గుర్రం నైపుణ్యాలకు అభిమానులతో పాటు దిగ్గజ బౌలర్లు సైతం ఫిదా అయ్యారు. 

0,0,0,4,0,వికెట్‌,1,0,1,0,0,0,వికెట్‌,1,వికెట్‌,0,0,1,1లెగ్‌బై,1,2,1,1,1 - నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు(3/14). గుజరాత్‌ టైటాన్స్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో బుమ్రా అద్భుత స్పెల్‌ను చాటిచెప్పే గణాంకాలు‌.

ఈ నేపథ్యంలో బుమ్రా ఆట తీరును ప్రశంసిస్తూ ఇంగ్లండ్‌ దిగ్గజ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ హర్షం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా సాహాను బౌల్డ్‌ చేయడాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘తన ట్రేడ్‌మార్క్‌ స్కిల్‌ ఇది. పేస్‌తో బ్యాటర్‌ను ముప్పుతిప్పలు పెట్టగల సత్తా అతడి సొంతం.

అత్యద్భుతమైన నైపుణ్యాలు, ప్రతిభ అతడికి ఉన్నాయి. అందుకే వ్యూహాలను పక్కాగా అమలు చేసి ప్రతిసారి విజయవంతమవుతాడు’’ అని బ్రాడ్‌.. బుమ్రాను కొనియాడాడు.

కాగా గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఆరంభంలోనే ఓపెనర్‌ వృద్ధిమాన్‌ సాహా(19) అద్భుత రీతిలో బౌల్డ్‌ చేసిన బుమ్రా.. అనంతరం సాయి సుదర్శన్‌(45), డేవిడ్‌ మిల్లర్‌(12) రూపంలో కీలక వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక అహ్మదాబాద్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై.. గుజరాత్‌ విధించిన 169 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది.

ఆఖరి వరకు పోరాడి ఆరు పరుగుల స్వల్ప తేడాతో పరాజయం పాలైంది. తద్వారా ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా తొలిసారి బరిలోకి దిగిన హార్దిక్‌ పాండ్యాకు చేదు అనుభవం ఎదురైంది. మరోవైపు.. గుజరాత్‌ సారథిగా శుబ్‌మన్‌ గిల్‌ మాత్రం తొలి మ్యాచ్‌లోనే విజయం అందుకున్నాడు.

చదవండి: #HardikPandya: హత్తుకునేందుకు వచ్చిన హార్దిక్‌.. మండిపడ్డ రోహిత్‌! పక్కనే అంబానీ..

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)