Breaking News

IPL 2024: కేకేఆర్‌ కీలక ప్రకటన... కెప్టెన్‌గా మళ్లీ అతడే

Published on Thu, 12/14/2023 - 15:16

IPL 2024- KKR Captain Announcement: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2024 సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఫ్రాంఛైజీ కీలక ప్రకటన చేసింది. టీమిండియా మిడిలార్డర్‌ స్టార్‌ శ్రేయస్‌ అయ్యర్‌ తిరిగి కేకేఆర్‌ పగ్గాలు చేపట్టనున్నట్లు వెల్లడించింది. అయ్యర్‌ కెప్టెన్సీలో నితీశ్‌ రాణా వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని తెలిపింది. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేసింది.

కాగా వెన్నునొప్పి కారణంగా శ్రేయస్‌ అయ్యర్‌ గతేడాది ఐపీఎల్‌కు దూరమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడి స్థానంలో నితీశ్‌ రాణా కేకేఆర్‌ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. రాణా సారథ్యంలో కేకేఆర్‌ ఆడిన పద్నాలుగు మ్యాచ్‌లలో ఆరు మాత్రమే గెలిచింది.

అయ్యర్‌ లేని లోటు పూడ్చేందుకు
తద్వారా పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికే పరిమితమైంది. కనీసం ప్లే ఆఫ్స్‌ కూడా చేరకుండానే నిష్క్రమించింది ఈ మాజీ చాంపియన్‌. అయితే, శ్రేయస్‌ అయ్యర్‌ లేని లోటును పూడ్చేందుకు నితీశ్‌ రాణా ప్రయత్నించిన తీరుపై మాత్రం ప్రశంసలు కురిశాయి. 

ఇక కేకేఆర్‌ సారథిగా పూర్తిస్థాయిలో సఫలం కాలేకపోయినా.. బ్యాటర్‌గా మాత్రం ఆకట్టుకున్నాడు నితీశ్‌ రాణా. ఐపీఎల్‌-2023లో పద్నాలుగు మ్యాచ్‌లలో కలిపి 413 పరుగులు సాధించాడు. కేకేఆర్‌ తరఫున రింకూ సింగ్‌(474) తర్వాత రెండో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 

కేకేఆర్‌ కెప్టెన్‌గా తిరిగి బాధ్యతలు చేపట్టనున్న అయ్యర్‌
ప్రస్తుతం శ్రేయస్‌ అ‍య్యర్‌ పూర్తిగా కోలుకోవడం సహా వన్డే వరల్డ్‌కప్‌-2023లో వరుస సెంచరీలతో అదరగొట్టడంతో.. మరలా అతడిని కెప్టెన్‌గా నియమిస్తూ కేకేఆర్‌ తాజాగా నిర్ణయం తీసుకుంది. అదే విధంగా గత ఎడిషన్‌ కెప్టెన్‌ నితీశ్‌ రాణాను అతడికి డిప్యూటీగా నియమించింది.

ఈ సందర్భంగా శ్రేయస్‌ అయ్యర్‌కు తిరిగి స్వాగతం పలుకుతూనే.. తమ అభ్యర్థన మేరకు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన నితీశ్‌ రాణాకు ధన్యవాదాలు తెలిపింది. అదే విధంగా శ్రేయస్‌ సైతం.. తన గైర్హాజరీలో రాణా జట్టును ముందుకు నడిపించిన తీరు అద్భుతమంటూ ప్రశంసించడం విశేషం. 

చదవండి: రితిక జోలికి వస్తే ఊరుకోను.. నాడు రోహిత్‌కు యువీ వార్నింగ్‌!

Videos

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)