Breaking News

IPL 2024: గేల్‌ రికార్డు సమం చేసిన బట్లర్‌.. రాహుల్‌ తర్వాత..!

Published on Sun, 04/07/2024 - 13:53

ఐపీఎల్‌ 2024లో భాగంగా ఆర్సీబీతో నిన్న (ఏప్రిల్‌ 6) జరిగిన మ్యాచ్‌లో శతక్కొట్టడంతో (58 బంతుల్లో 100 నాటౌట్‌; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) రాజస్థాన్‌ రాయల్స్‌ ఆటగాడు జోస్‌ బట్లర్‌ రికార్డుల్లోకెక్కాడు. ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. నిన్నటి సెంచరీతో క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో సెంచరీల సంఖ్యను ఆరుకు పెంచుకున్న బట్లర్‌.. యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌తో (6) కలిసి సంయుక్తంగా రెండో స్థానాన్ని షేర్‌ చేసుకున్నాడు.

బట్లర్‌ తన వందో ఐపీఎల్‌ మ్యాచ్‌లో వంద కొట్టడం మరో విశేషం. ఐపీఎల్‌ చరిత్రలో బట్లర్‌కు ముందు కేఎల్‌ రాహుల్‌ మాత్రమే ఈ ఘనత సాధించాడు. రాహుల్‌ సైతం తన వందో మ్యాచ్‌లో శతక్కొట్టాడు.  ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు ఆర్సీబీ ఆటగాడు విరాట్‌ కోహ్లి పేరిట ఉంది. బట్లర్‌ నిన్న సెంచరీ చేసిన మ్యాచ్‌లోనే విరాట్‌ కూడా సెంచరీ చేశాడు. ఈ సెంచరీతో విరాట్ ఐపీఎల్‌ సెంచరీల సంఖ్య ఎనిమిదికి చేరింది. 

మ్యాచ్‌ విషయానికొస్తే.. ఆర్సీబీపై రాజస్థాన్‌ రాయల్స్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ  విరాట్‌ కోహ్లి అజేయ సెంచరీతో (72 బంతుల్లో 113 నాటౌట్‌; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) కదంతొక్కడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. డుప్లెసిస్‌ (44) రాణించాడు. ఈ మ్యాచ్‌లో విరాట్‌ తన సెంచరీ పూర్తి చేసేందుకు 67 బంతులు తీసుకుని విమర్శలపాలయ్యాడు.

ఐపీఎల్‌ చరిత్రలో బంతుల పరంగా ఇది స్లోయెస్ట్‌ సెంచరీ కావడమే విరాట్‌పై విమర్శలకు కారణం. అశ్విన్‌ (4-0-28-0), చహల్‌ (4-0-34-2) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో విరాట్‌ వేగంగా పరుగులు సాధించలేకపోయాడు. పిచ్‌ కూడా విరాట్‌ బ్యాటింగ్‌ సమయంలో స్పిన్నర్ల పక్షాన ఉండింది.  

అనంతరం 184 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్‌.. బట్లర్‌ సుడిగాలి శతకంతో విరుచుకపడటంతో మరో ఐదు బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. బట్లర్‌తో పాటు సంజూ శాంసన్‌ (42 బంతుల్లో 69; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. రాయల్స్‌ విజయానికి ఆరు బంతుల్లో ఒక్క పరుగు చేయాల్సిన తరుణంలో బట్లర్‌ సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేసి మ్యాచ్‌ను ముగించాడు. ఈ విజయంతో రాయల్స్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. తాజా ఓటమితో ఆర్సీబీ ఎనిమిదో స్థానానికి పడిపోయింది. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)