Breaking News

ఆ రూల్‌ వల్ల భారత ఆల్‌రౌండర్లకు చాలా నష్టపోతున్నారు: రోహిత్‌ శర్మ

Published on Thu, 04/18/2024 - 18:29

ఐపీఎల్‌లో అమల్లో ఉన్న ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధనపై టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ నిబంధన వల్ల భారత ఆల్‌రౌండర్లు చాలా నష్టపోతున్నారని వాపోయాడు.

వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే లాంటి వారు తమ బౌలింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించుకోవడానికి వీలు లేకుండా పోయిందని అన్నాడు. ఓవరాల్‌గా ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనకు తాను అభిమానిని కాదని పేర్కొన్నాడు. వినోదం కోసం నిబంధనలను ఇంతలా సడలించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు.

తాజాగా జరిగిన ఓ పోడ్‌కాస్ట్‌లో హిట్‌మ్యాన్‌ ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌పై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఈ పోడ్‌కాస్ట్‌లో రోహిత్‌ క్రికెటర్లకు సంబంధించిన చాలా విషయాలను షేర్‌ చేసుకున్నాడు. 

కాగా, ఐపీఎల్‌లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధనను 2023 సీజన్‌లో ప్రవేశపెట్టారు. ఈ రూల్ వల్ల అన్ని జట్లు అవసరానికి అనుగుణంగా ఓ అదనపు ప్లేయర్‌ సేవలను వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు తొలుత బ్యాటింగ్‌ చేసే జట్టు అదనంగా ఓ బ్యాటర్‌ను వినియోగించుకుంటుంది. అలాగే తొలుత బౌలింగ్‌ చేసే జట్టుకు అదనంగా ఓ బౌలర్‌ సేవలు వినియోగించుకునే అవకాశం ఉంటుంది.

మొత్తంగా చూస్తే 11 మంది ఆడాల్సిన క్రికెట్‌ ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధన వల్ల 12 మంది క్రికెట్‌గా మారింది. శివమ్‌ దూబే, వాషింగ్టన్‌ సుందర్‌ లాంటి ఆల్‌రౌండర్లు కేవలం​ బ్యాటింగ్‌కే పరిమితమవుతున్నారు. దీని వల్ల వారిని ఆల్‌రౌండర్లుగా పరిగణించలేని పరిస్థితి ఏర్పడింది. దేశానికి ప్రాతినిథ్యం వహించే సమయంలో ఆల్‌రౌండర్లకు డిమాండ్‌ ఉంటుంది. అలాంటప్పుడు వీరు ఏదో ఒక​ విభాగానికే పరిమితమైతే వారి కెరీర్‌లు ఇరుకున పడే ప్రమాదం ఉంది. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)