Breaking News

IPL 2024 Playoffs: ముగిసిన లీగ్ మ్యాచ్‌లు.. ప్లే ఆఫ్స్‌కు చేరిన జ‌ట్లు ఇవే

Published on Sun, 05/19/2024 - 23:34

ఐపీఎల్‌-2024లో లీగ్ ద‌శ మ్యాచ్‌లు ముగిశాయి. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా గౌహ‌తి వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌, రాజ‌స్తాన్ రాయ‌ల్స్ మ‌ధ్య జ‌రగాల్సిన చివ‌రి లీగ్ మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు అయింది. టాస్ ప‌డిన‌ప్ప‌ట‌కి మ‌రోసారి వ‌ర్షం మొద‌లు కావ‌డంతో మ్యాచ్‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు అంపైర్‌లు ప్ర‌క‌టించారు.

ఇక లీగ్ స్టేజీ ముగియ‌డంతో ప్లే ఆఫ్స్‌కు చేరిన జ‌ట్ల‌పై ఓ లూక్కేద్దం. పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్‌-4లో నిలిచిన  కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌,  రాజ‌స్తాన్ రాయ‌ల్స్, ఆర్సీబీ జ‌ట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హ‌త సాధించాయి. 

పాయింట్ల టేబుల్‌లో కేకేఆర్‌(19) పాయింట్ల‌తో అగ్ర‌స్ధానంలో ఉండ‌గా.. ఎస్ఆర్‌హెచ్ 17(నెట్ ర‌న్‌రేట్ +0.414), రాజ‌స్తాన్ 17(నెట్ ర‌న్‌రేట్ +0.273), ఆర్సీబీ(14) పాయింట్ల‌తో వ‌రస‌గా రెండు, మూడు ,నాలుగు స్ధానాల్లో నిలిచాయి.  

ఇక మే 21 నుంచి నాకౌట్ మ్యాచ్‌లకు తెర‌లేవ‌నుంది. మే 21న అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న తొలి క్వాలిఫియ‌ర్‌లో కేకేఆర్‌, ఎస్ఆర్‌హెచ్ జ‌ట్లు త‌ల‌ప‌డునున్నాయి. మే 22న ఎలిమినేట‌ర్‌లో ఆర్సీబీ, రాజ‌స్తాన్ అమీతుమీ తెల్చుకోనున్నాయి.

 అనంత‌రం మే 24 క్వాలిఫియ‌ర్-2లో ఎలిమినేట‌ర్‌లో గెలిచిన జ‌ట్టు,  క్వాలిఫియ‌ర్‌-1లో ఓడిన జ‌ట్టు త‌ల‌ప‌డ‌నున్నాయి. మే 26న చెపాక్ వేదిక‌గా ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)