Breaking News

ఐపీఎల్‌ 2024 వేలంలో పాల్గొనబోయే ఆటగాళ్ల జాబితా విడుదల

Published on Mon, 12/11/2023 - 21:20

దుబాయ్‌ వేదికగా ఈ నెల 19న జరిగే ఐపీఎల్‌ 2024 వేలంలో పాల్గొనబోయే ఆటగాళ్ల జాబితాను ఐపీఎల్‌ గవర్నింగ్‌ బాడీ కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది. 77 స్లాట్‌ల కోసం (47 స్లాట్‌లు భారత్‌ ఆటగాళ్ల కోసం, 30 స్లాట్‌లు విదేశీ ఆటగాళ్ల కోసం) జరిగే ఈ వేలంలో మొత్తం 333 మంది ఆటగాళ్లు పాల్గొననున్నారు.

ఇందులో 214 మంది భారత ఆటగాళ్లు కాగా.. 119 మంది విదేశీ ఆటగాళ్లు (ఇద్దరు అసోసియేట్‌ దేశాల ఆటగాళ్లు కలుపుకుని) ఉన్నారు. మొత్తం జాబితాలో 116 మంది క్యాప్డ్‌ ప్లేయర్స్‌ కాగా.. 215 మంది అన్‌క్యాప్డ్‌ ప్లేయర్స్‌, ఇద్దరు అసోసియేట్‌ దేశాల ఆటగాళ్లు ఉన్నారు. 

ఈ జాబితాలో 23 మంది ఆటగాళ్లు రూ. 2 కోట్ల బేస్‌ ధర విభాగంలో పేర్లు నమోదు చేసుకోగా.. 13 మంది రూ. 1.5 కోట్ల బేస్ ధరలో తమ పేర్లను రిజిస్టర్‌ చేసుకున్నారు. ఈ వేలం భారతకాలమానం ప్రకారం డిసెంబర్‌ 19న మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. 

సెట్‌ నంబర్ 1:

హ్యారీ బ్రూక్, ట్రవిస్‌ హెడ్, కరుణ్ నాయర్‌, మనీష్ పాండే, రోవ్‌మన్‌ పావెల్, రిలీ రొస్సో, స్టీవ్‌ స్మిత్

సెట్‌ నంబర్‌ 2:

గెరాల్డ్‌ కోయెట్జీ, పాట్‌ కమిన్స్, వనిందు హసరంగా, డారిల్ మిచెల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్షల్ పటేల్‌, రచిన్ రవీంద్ర, శార్దూల్‌ ఠాకూర్, క్రిస్‌ వోక్స్

సెట్‌ నంబర్‌ 3:

కేఎస్‌ భరత్‌, జోస్‌ ఇంగ్లిస్‌, కుశాల్‌ మెండిస్‌, ఫిలిప్‌ సాల్ట్‌, ట్రిస్టన్‌ స్టబ్స్‌

సెట్‌ నంబర్‌ 4:

లోకీ ఫెర్గూసన్, జోష్‌ హాజిల్‌వుడ్, అల్జరీ జోసఫ్‌, మధుషంక, శివమ్‌ మావి, చేతన్‌ సకారియా, మిచెల్‌ స్టార్క్, జయదేవ్‌ ఉనద్కత్, ఉమేష్ యాదవ్‌

Videos

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)