Breaking News

IPL 2024 LSG Vs GT: లక్నో ‘హ్యాట్రిక్‌’ విక్టరీ

Published on Mon, 04/08/2024 - 06:25

లక్నో: ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఐపీఎల్‌ 17వ సీజన్‌లో ‘హ్యాట్రిక్‌’ విజయాన్ని నమోదు చేసింది. గత సీజన్‌ రన్నరప్‌ గుజరాత్‌ టైటాన్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో లక్నో జట్టు 33 పరుగుల తేడాతో గెలిచింది. మొదట లక్నో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. గుజరాత్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో లక్నో 18 పరుగులకే 2 కీలక వికెట్టు కోల్పోయి కష్టాల్లో పడింది.

కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (31 బంతుల్లో 33; 3 ఫోర్లు), స్టొయినిస్‌ (43 బంతుల్లో 58; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) మూడో వికెట్‌కు 73 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఆఖర్లో నికోలస్‌ పూరన్‌ (22 బంతుల్లో 32; 3 సిక్స్‌లు), ఆయూశ్‌ బదోని (11 బంతుల్లో 20; 3 ఫోర్లు) ధాటిగా ఆడారు. అనంతరం సులువైన లక్ష్యమే ఎదురైనా... గుజరాత్‌ బ్యాటర్ల నిర్లక్ష్యం జట్టును ముంచింది. చివరకు గుజరాత్‌ 18.5 ఓవర్లలో 130 పరుగులకే కుప్పకూలింది.

మీడియం పేసర్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ యశ్‌ ఠాకూర్‌ (5/30), స్పిన్నర్‌ కృనాల్‌ పాండ్యా (3/11) గుజరాత్‌ను దెబ్బ తీశారు. 54 పరుగుల వరకు వికెట్‌ కోల్పోని గుజరాత్‌ అనూహ్యంగా మరో 76 పరుగుల వ్యవధిలో 10 వికెట్లు చేజార్చుకోవడం గమనార్హం. కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (19; 2 ఫోర్లు)ను యశ్‌ ఠాకూర్‌ బౌల్డ్‌ చేయగా, రవి బిష్ణోయ్‌ కళ్లు చెదిరే రిటర్న్‌ క్యాచ్‌తో కేన్‌ విలియమ్సన్‌ (1) ని్రష్కమించాడు. కృనాల్‌ పాండ్యా కూడా స్పిన్‌తో తిప్పేయడంతో గుజరాత్‌ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి ఓటమిని ఆహ్వానించింది.   

స్కోరు వివరాలు
లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: డికాక్‌ (సి) నూర్‌ (బి) ఉమేశ్‌ 6; కేఎల్‌ రాహుల్‌ (సి) తెవాటియా (బి) దర్శన్‌ 33; పడిక్కల్‌ (సి) శంకర్‌ (బి) ఉమేశ్‌ 7; స్టొయినిస్‌ (సి) శరత్‌ (బి) దర్శన్‌ 58; పూరన్‌ (నాటౌట్‌) 32; బదోని (సి) ఉమేశ్‌ (బి) రషీద్‌ ఖాన్‌ 20; కృనాల్‌
పాండ్యా (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 163.
వికెట్ల పతనం: 1–6, 2–18, 3–91, 4–112, 5–143.
బౌలింగ్‌: ఉమేశ్‌ 3–0–22–2, జాన్సన్‌ 4–0–32–0, రషీద్‌ 4–0–28–1, మోహిత్‌ 3–0 –34–0, నూర్‌ 4–0–22–0, దర్శన్‌ 2–0–21–2.

గుజరాత్‌ టైటాన్స్‌ ఇన్నింగ్స్‌: సాయి సుదర్శన్‌ (సి) రవి బిష్ణోయ్‌ (బి) కృనాల్‌ 31; గిల్‌ (బి) యశ్‌ ఠాకూర్‌ 19; విలియమ్సన్‌ (సి అండ్‌ బి) రవి బిష్ణోయ్‌ 1; శరత్‌ (సి) బదోని (బి) కృనాల్‌ 2; విజయ్‌ శంకర్‌ (సి) రాహుల్‌ (బి) యశ్‌ 17; దర్శన్‌ (సి) యశ్‌ ఠాకూర్‌ (బి) కృనాల్‌ 12; తెవాటియా (సి) పూరన్‌ (బి) యశ్‌ 30; రషీద్‌ ఖాన్‌ (సి) సబ్‌–హుడా (బి) యశ్‌ ఠాకూర్‌ 0; ఉమేశ్‌ (సి) డికాక్‌ (బి) నవీనుల్‌ 2; జాన్సన్‌ (నాటౌట్‌) 0; నూర్‌ అహ్మద్‌ (సి) డికాక్‌ (బి) యశ్‌ ఠాకూర్‌ 4; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (18.5 ఓవర్లలో ఆలౌట్‌) 130.
వికెట్ల పతనం: 1–54, 2–56, 3–58, 4–61, 5–80, 6–93, 7–93, 8–102, 9–126, 10–130.
బౌలింగ్‌: సిద్ధార్థ్‌ 4–0–29–0, నవీనుల్‌ 4–0–37–1, మయాంక్‌ 1–0–13–0, యశ్‌ ఠాకూర్‌ 3.5–1– 30–5, కృనాల్‌  4–0–11–3, రవి బిష్ణోయ్‌ 2–0–8–1.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)