Breaking News

IPL 2024: లక్నోపై ఆర్సీబీ ఆధిపత్యం కొనసాగేనా..?

Published on Tue, 04/02/2024 - 12:36

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 2) రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్లు తలపడనున్నాయి. ఆర్సీబీ సొంత మైదానమైన చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరుగనుంది. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ఆర్సీబీ.. కేకేఆర్‌తో ఆడిన తమ చివరి మ్యాచ్‌లో హోం గ్రౌండ్‌లో పరాజయం చవిచూసింది. 

ఈ సీజన్‌లో ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింట పరాజయాలు ఎదుర్కొని పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉండగా.. లక్నో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓ గెలుపు, ఓ ఓటమితో ఆరో స్థానంలో నిలిచింది. ఆర్సీబీ.. సీఎస్‌కే, కేకేఆర్‌ చేతుల్లో ఓడి పంజాబ్‌పై గెలుపొందగా.. రాజస్థాన్‌ చేతిలో ఓడిన లక్నో.. పంజాబ్‌పై విజయం సాధించింది. 

హెడ్‌ టు హెడ్‌ రికార్డుల విషయానికొస్తే..
ఐపీఎల్‌లో ఇరు జట్లు ఇప్పటివరకు నాలుగుసార్లు ఎదురెదురుపడగా.. మూడు మ్యాచ్‌ల్లో ఆర్సీబీ, ఓ మ్యాచ్‌లో లక్నో గెలుపొందాయి. ఐపీఎల్‌లో లక్నోపై ఆర్సీబీ స్పష్టమైన ఆధిపత్యం కలిగి ఉంది.

మెరుగ్గా కనిపిస్తున్న లక్నో..
అయితే ప్రస్తుత సీజన్‌లో పరిస్థితి భిన్నంగా కనిపిస్తుంది. ఆర్సీబీతో పోలిస్తే ఎల్‌ఎస్‌జీ పటిష్టంగా కనిపిస్తుంది. డికాక్‌, రాహుల్‌, పడిక్కల్‌, స్టోయినిస్‌, పూరన్‌, కృనాల్‌ పాండ్యా, ఆయుశ్‌ బదోనిలతో కూడిన లక్నో బ్యాటింగ్‌ లైనప్‌ బలహీనమైన ఆర్సీబీ బౌలింగ్‌కు సవాలు విసురుతుంది.

బౌలింగ్‌ విభాగంలోనూ లక్నో ఆర్సీబీ కంటే మెరుగ్గా కనిపిస్తుంది. సంచలన పేసర్‌ మయాంక్‌ యాదవ్‌, నవీన్‌ ఉల్‌ హక్‌, మొహిసిన్‌ ఖాన్‌, రవి భిష్ణోయ్‌, కృనాల్‌తో లక్నో బౌలింగ్‌ లైనప్‌ పటిష్టంగా ఉంది. 

ఆర్సీబీ విషయానికొస్తే.. బ్యాటింగ్‌ విభాగంలో ఈ జట్టు పేపర్‌పై పటిష్టంగానే కనిపిస్తున్నా.. ఒక్క విరాట్‌ కోహ్లి మాత్రమే ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో రాణించాడు. డుప్లెసిస్‌, మ్యాక్స్‌వెల్‌, గ్రీన్‌లు ఇప్పటివరకు బ్యాట్‌కు పని చెప్పలేదు. దినేశ్‌ కార్తీక్‌ ఆఖర్లో తన పాత్రను న్యాయం చేస్తున్నాడు. కోహ్లి, కార్తీక్‌ మినహా ఆర్సీబీ బ్యాటింగ్‌లో ఇప్పటివరకు చెప్పుకోదగ్గ ప్రదర్శనలు లేవు.

బౌలింగ్‌ విషయానికొస్తే.. ఈ విభాగంలో ఆర్సీబీ చాలా పూర్‌గా ఉంది. సిరాజ్‌, యశ్‌ దయాల్‌, అల్జరీ జోసఫ్‌ ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్‌లోనూ రాణించలేదు. ప్రస్తుత సీజన్‌లో ఆర్సీబీ బౌలింగ్‌ లైనప్‌ అత్యంత బలహీనమైనదిగా కనిపిస్తుంది. మరి లక్నోతో మ్యాచ్‌లో ఆర్సీబీ ఏ మేరకు రాణిస్తుందో వేచి చూడాలి. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)