Breaking News

IPL 2024: సొంత అభిమానులనే ఆట పట్టించిన జడ్డూ.. వైరల్‌ వీడియో

Published on Tue, 04/09/2024 - 10:29

చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో కేకేఆర్‌తో నిన్న (ఏప్రిల్‌ 8) జరిగిన మ్యాచ్‌ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సీఎస్‌కే స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా సొంత అభిమానులనే ఆటపట్టించాడు. సీఎస్‌కే లక్ష్యాన్ని ఛేదిస్తుండగా.. జడ్డూ ధోని కంటే ముందే బ్యాటింగ్‌కు దిగుతున్నట్లు ప్రాంక్‌ చేసి ఫ్యాన్స్‌ను టీజ్‌ చేశాడు. సీఎస్‌కే గెలుపు ఖరారైన దశలో శివమ్‌ దూబే ఔట్‌ కాగా.. ఆ దశలో ధోని బ్యాటింగ్‌కు దిగాల్సి ఉంది.

అయితే జడ్డూ ధోని కంటే ముందే బరిలోకి దిగుతున్నట్లు నటించి అభిమానులను టీజ్‌ చేశాడు. కొంత దూరం వెళ్లి అభిమానులు కేకలు పెట్టడంతో జడ్డూ తిరిగి వెనక్కు వెళ్లిపోయాడు. అనంతరం​ ధోని బరిలోకి దిగి జట్టును విజయతీరాలకు చేర్చడంలో భాగమయ్యాడు. జడ్డూ సరదాగా చేసిన ఈ పని నవ్వులు పూయించింది. స్టేడియంలో ఉన్నవారంతా కాసేపు తనివితీరా నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. 

ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో కేకేఆర్‌పై సీఎస్‌కే 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌.. రవీంద్ర జడేజా (4-0-18-3), తుషార్‌ దేశ్‌పాండే (4-0-33-3), ముస్తాఫిజుర్‌ (4-0-22-2), తీక్షణ (4-0-28-1) దెబ్బకు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. విధ్వంసకర వీరులున్న కేకేఆర్‌ ఈ మ్యాచ్‌లో తేలిపోయింది. సాల్ట్‌ (0), వెంకటేశ్‌ అయ్యర్‌ (3), రింకూ సింగ్‌ (9), రసెల్‌ (10) తస్సుమనిపించారు. నరైన్‌ (27), రఘువంశీ (24), శ్రేయస్‌ అయ్యర్‌ (34) నామమాత్రపు స్కోర్లు చేశారు. 

స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సీఎస్‌కేను రుతురాజ్‌ (67 నాటౌట్‌) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌ ఆడి గెలిపించాడు. రచిన్‌ రవీంద్ర 15, డారిల్‌ మిచెల్‌ 25, శివమ్‌ దూబే 28 పరుగులు (18 బంతుల్లో ఫోర్‌, 3 సిక్సర్లు) చేసి ఔట్‌ కాగా.. ధోని ఒక్క పరుగు చేసి నాటౌట్‌గా మిగిలాడు. కేకేఆర్‌ బౌలర్లలో వైభవ్‌ అరోరా 2 వికెట్లు పడగొట్టగా.. నరైన్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)