Breaking News

IPL 2024: 150 కొట్టిన సీఎస్‌కే.. ఇంకో రెండేస్తే ప్రపంచ రికార్డు

Published on Mon, 04/15/2024 - 14:18

పొట్టి క్రికెట్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ అరుదైన ఘనత సాధించింది. ఈ ఫార్మాట్‌లో సీఎస్‌కే 150 విజయాల మైలురాయిని తాకింది. ఐపీఎల్‌ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో నిన్న (ఏప్రిల్‌ 14) జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా టీ20ల్లో 150 విజయాలను పూర్తి చేసుకుంది. పొట్టి క్రికెట్‌ చరిత్రలో సీఎస్‌కేకు ముందు సహచర ఐపీఎల్‌ జట్టు ముంబై ఇండియన్స్‌ మాత్రమే 150 విజయాల మైలురాయిని తాకింది.  
 
టీ20 ఫార్మాట్‌లో ముంబై ఇండియన్స్‌ 273 మ్యాచ్‌ల్లో 151 విజయాలు సాధించగా.. సీఎస్‌కే 255 మ్యాచ్‌ల్లో 150 విజయాలు నమోదు చేసింది. ఆసక్తికర మరో విషయం ఏంటంటే.. ముంబై, సీఎస్‌కే జట్లు ఇప్పటివరకు  చెరి ఐదేసి ఐపీఎల్‌ టైటిళ్లు సాధించాయి. టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్ల జాబితాలో ముంబై, సీఎస్‌కే తర్వాత టీమిం‍డియా ఉంది. ఈ ఫార్మాట్‌లో భారత క్రికెట్‌ జట్టు 219 మ్యాచ్‌ల్లో 140 విజయాలు సాధించింది. 

మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై చెన్నై సూపర్‌ కింగ్స్‌ 20 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే.. రుతురాజ్‌ (40 బంతుల్లో 69; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), శివమ్‌ దూబే (38 బంతుల్లో 66 నాటౌట్‌; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్దసెంచరీలతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్‌లో ధోని సుడిగాలి ఇన్నింగ్స్‌తో శివాలెత్తిపోయాడు. ఇన్నింగ్స్‌లో చివరి నాలుగు బంతుల్లో హ్యాట్రిక్‌ సిక్సర్లు సహా 20 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. హార్దిక్‌ పాండ్యా వేసిన ఈ ఓవర్‌లో సీఎస్‌కే మొత్తంగా 26 పరుగులు రాబట్టింది. 

అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. రోహిత్‌ శర్మ మెరుపు సెంచరీతో (63 బంతుల్లో 105 నాటౌట్‌; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) కదం తొక్కినప్పటికీ లక్ష్యానికి 21 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. 4 వికెట్లు తీసిన పతిరణ సీఎస్‌కే గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)