Breaking News

IPL 2024- BCCI: అభిమానులకు బ్యాడ్‌న్యూస్‌!

Published on Sat, 03/16/2024 - 10:54

IPL 2024: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ తాజా ఎడిషన్‌ నిర్వహణ విషయంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌-2024 ద్వితీయ అర్ధభాగ మ్యాచ్‌ల వేదికను మార్చనున్నట్లు సమాచారం.

దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ మేరకు బీసీసీఐ సమాలోచనలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఐపీఎల్‌ పదిహేడో సీజన్‌ను పూర్తిగా భారత్‌లోనే నిర్వహించడం ఖాయమైనట్లు లీగ్‌ చైర్మన్‌ అరుణ్‌ ధూమల్‌  గతంలోనే నిర్ధారించారు.

ఫలితంగా... లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో భారత్‌ బయట మ్యాచ్‌లు జరిపే అవకాశాలపై జరిగిన చర్చకు  తెర పడినట్లయింది. తొలుత 15 రోజుల మ్యాచ్‌ల షెడ్యూల్‌ విడుదల చేసి... ఆ తర్వాత మిగతా మ్యాచ్‌ల తేదీలను ప్రకటిస్తామని తెలిపారు.

అంతేకాదు.. అన్ని మ్యాచ్‌లు భారత్‌లోనే నిర్వహించడం ఖాయమని అరుణ్‌ ధుమాల్‌ పేర్కొన్నారు. ఇందుకు తగ్గట్లుగానే ఫిబ్రవరి 22న తొలి 17 రోజుల మ్యాచ్‌ల(21)కు సంబంధించిన షెడ్యూల్‌ విడుదల చేశారు. మార్చి 22 నుంచి లీగ్‌ ఆరంభం కానున్నట్లు తెలిపారు నిర్వాహకులు.

అయితే, సెకండాఫ్‌ నిర్వహణ విషయంలో మాత్రం బీసీసీఐ తాజాగా నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. మిగిలిన మ్యాచ్‌లు దుబాయ్‌లో నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు బీసీసీఐ సన్నిహిత వర్గాలు తెలిపినట్లు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా తన కథనంలో పేర్కొంది.

‘‘భారత ఎన్నికల సంఘం ఈరోజు(శనివారం) మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఎన్నికల నిర్వహణ షెడ్యూల్‌ను ప్రకటించనుంది. ఆ తర్వాతే ఐపీఎల్‌ సెకండాఫ్‌ ఎక్కడ నిర్వహించాలన్న అంశంపై బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుంది.

వేదికగా దుబాయ్‌ను ఎంచుకోవాలా లేదంటే ఇక్కడే అన్ని మ్యాచ్‌లను నిర్వహించాలా అన్న విషయం తేలుతుంది. అయితే, బీసీసీఐలోని కొంతమంది పెద్దలు మాత్రం ఇప్పటికే దుబాయ్‌ వైపు మొగ్గుచూపుతున్నారు’’ అని తెలిపింది. ఒకవేళ ఐపీఎల్‌-2024 మిగిలిన మ్యాచ్‌లను దుబాయ్‌లో నిర్వహించడం ఖాయమైతే.. దేశంలోనే మ్యాచ్‌లు(ఖర్చుల దృష్ట్యా) వీక్షించాలనుకున్న  అభిమానులకు షాక్‌ తగిలినట్లే మరి!!

చదవండి: ICC- T20WC: ఎడాపెడా దంచేసినా పర్లేదు కానీ.. ఇకపై అలా కుదరదు!

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)