Breaking News

SRH Vs RR: చేతులు కాలాక.. తాపత్రయపడితే ఏం లాభం! 13 కోట్లు.. ఒక్క సిక్సర్‌ కూడా లేదు!

Published on Mon, 04/03/2023 - 08:18

IPL 2023- Sunrisers Hyderabad vs Rajasthan Royals: ఒక్క మెరుపు బ్యాటింగ్‌ ప్రదర్శన లేదు. గెలిపించే భాగస్వామ్యమే రాలేదు. టాప్‌–5లో ఒక్కరూ కనీసం ఒక్క సిక్స్‌ అయినా కొట్టలేదు. ఇలాంటి ఆటతో ఐపీఎల్‌ మ్యాచ్‌ గెలవాలని ఏ జట్టయినా కోరుకోవడం అత్యాశే అవుతుంది. ఆదివారం ఉప్పల్‌ మైదానంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆట ఇలాగే ఉంది.

ముందుగా నియంత్రణ లేని బౌలింగ్‌తో రెండొందలకు పైగా పరుగులు ఇచ్చిన జట్టు ఆ తర్వాత బ్యాటింగ్‌లో పూర్తిగా చేతులెత్తేసింది. తొలి ఓవర్లోనే 2 వికెట్లు కోల్పోయిన తర్వాత ఇక కోలుకునే అవకాశమే లేకపోయింది. ఫలితమే సొంతగడ్డపై భారీ ఓటమి. అన్ని రంగాల్లో రాణించిన రాజస్తాన్‌ రాయల్స్‌ ఘనవిజయంతో తమ సీజన్‌ ప్రస్థానాన్ని మొదలు పెట్టింది.    

సాక్షి, హైదరాబాద్‌: కొత్త ఐపీఎల్‌ సీజన్‌(2023)ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చెత్తగా ప్రారంభించింది. నాలుగేళ్ల తర్వాత సొంతగడ్డపై జరిగిన తొలి పోరులో పేలవ ప్రదర్శనతో ఓటమిని మూటగట్టుకుంది. ఆదివారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ 72 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌పై ఘన విజయం సాధించింది.

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ రాయల్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. జట్టులో టాప్‌–3 ఆటగాళ్లు అర్ధ సెంచరీలు సాధించడం విశేషం. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జోస్‌ బట్లర్‌ (22 బంతుల్లో 54; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెప్టెన్‌ సంజూ సామ్సన్‌ (32 బంతుల్లో 55; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), యశస్వి జైస్వాల్‌ (37 బంతుల్లో 54; 9 ఫోర్లు) హాఫ్‌ సెంచరీలు నమోదు చేశారు.

అనంతరం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 131 పరుగులు చేసి ఓడిపోయింది. అబ్దుల్‌ సమద్‌ (32 బంతుల్లో 32 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. రాజస్తాన్‌ రాయల్స్‌ లెగ్‌ స్పిన్నర్‌ చహల్‌ (4/17) ఆకట్టుకున్నాడు.  

ఓపెనర్ల జోరు... 
పవర్‌ప్లేలో ఇద్దరు రాజస్తాన్‌ ఓపెనర్లు యశస్వి, బట్లర్‌ విధ్వంసం సృష్టించారు. సన్‌రైజర్స్‌ తాత్కాలిక కెప్టెన్‌ భువనేశ్వర్‌ వేసిన తొలి ఓవర్లో 6 పరుగులే వచ్చినా... ఆ తర్వాతి ఐదు ఓవర్లలో రాయల్స్‌ వరుసగా 14, 17, 19, 17, 12 పరుగులు రాబట్టింది. భువీ ఓవర్లో యశస్వి రెండు ఫోర్లు, బట్లర్‌ సిక్స్‌ కొట్టగా... వాషింగ్టన్‌ సుందర్‌ ఓవర్లో వరుస బంతుల్లో బట్లర్‌ రెండు సిక్స్‌లు బాదాడు.

ఆపై నటరాజన్‌ ఓవర్లో బట్లర్‌ 4 ఫోర్లుతో చెలరేగాడు. ఫజల్‌ ఓవర్లో కూడా 3 ఫోర్లు కొట్టి 20 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న బట్లర్‌ అదే ఓవర్లో వెనుదిరిగాడు. దాంతో 85 పరుగుల (35 బంతుల్లో) తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెర పడింది. 7.4 ఓవర్లలో రాజస్తాన్‌ స్కోరు 100 పరుగులకు చేరింది. ఈ దశలో రాయల్స్‌ ఇన్నింగ్స్‌ బాధ్యతను కెప్టెన్‌ సామ్సన్‌ తీసుకున్నాడు.

సామ్సన్‌ తనదైన శైలిలో దూకుడు ప్రదర్శించగా, మరోవైపు 34 బంతుల్లో యశస్వి హాఫ్‌ సెంచరీ పూర్తయింది. ఉమ్రాన్‌ తొలి ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన సామ్సన్, అతని తర్వాతి మరో ఫోర్, సిక్స్‌ బాదాడు. తక్కువ వ్యవధిలో రాజస్తాన్‌ జట్టు యశస్వి, దేవదత్‌ పడిక్కల్‌ (2), రియాన్‌ పరాగ్‌ (7) వికెట్లను కోల్పోగా, 28 బంతుల్లో సామ్సన్‌ హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.

చేతులు కాలాక
హైదరాబాద్‌ బౌలర్లు కట్టడి చేయడంతో 7–15 మధ్య తొమ్మిది ఓవర్లలో రాజస్తాన్‌ 75 పరుగులు చేసింది. ఆపై డెత్‌ ఓవర్లలో కూడా స్కోరును పెంచుకోవడంలో రాయల్స్‌ విఫలమైంది. మరోసారి హైదరాబాద్‌ బౌలర్లు చక్కటి బంతులతో ప్రత్యర్థిని నిరోధించగలిగారు. ఆఖరి ఐదు ఓవర్లలో సామ్సన్‌ వికెట్‌ కోల్పోయి రాజస్తాన్‌ 43 పరుగులే సాధించగలిగింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.భారీ ఓపెనింగ్‌ భాగస్వామ్యం కారణంగానే ఆ జట్టు స్కోరు 200 పరుగులు దాటింది.  

సమష్టి వైఫల్యం... 
భారీ లక్ష్య ఛేదనలో రైజర్స్‌కు ఆరంభంలోనే దెబ్బ పడింది. బౌల్ట్‌ వేసిన తొలి ఓవర్లోనే అభిషేక్‌ శర్మ (0), రాహుల్‌ త్రిపాఠి (0) వెనుదిరిగారు. పేలవ ప్రదర్శన కారణంగా పవర్‌ప్లేను హైదరాబాద్‌ 30 పరుగులతోనే ముగించింది. ఘనమైన రికార్డులు, ఎన్నో అంచనాలతో తొలిసారి ఐపీఎల్‌లో అడుగు పెట్టిన ఇంగ్లండ్‌ హిట్టర్‌ హ్యారీ బ్రూక్‌ (21 బంతుల్లో 13; 1 ఫోర్‌) ప్రభావం చూపలేకపోయాడు. 13.25 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన అతడు.. తొలి మ్యాచ్‌లో కనీసం ఒక్క సిక్సర్‌ కూడా కొట్టలేకపోయాడు.

యజువేంద్ర చహల్‌ బౌలింగ్‌లో బ్రూక్‌ బౌల్డయ్యాడు. గ్లెన్‌ ఫిలిప్స్‌ (8) కూడా విఫలం కావడంతో 48 పరుగుల వద్ద హైదరాబాద్‌ సగం టీమ్‌ డగౌట్‌ చేరింది. తప్పనిసరి పరిస్థితుల్లో ధాటిగా ఆడే ప్రయత్నంలో మయాంక్‌ అగర్వాల్‌ (23 బంతుల్లో 27; 3 ఫోర్లు) అవుట్‌ కావడంతో సన్‌రైజర్స్‌ గెలుపు ఆశలు కోల్పోయింది.

చివర్లో సమద్‌ కొన్ని మెరుపులు మెరిపించినా అప్పటికే బాగా ఆలస్యమైపోయింది. ఇన్నింగ్స్‌ ఆఖరి రెండు ఓవర్లలో సమద్‌ 2 ఫోర్లు, 1 సిక్స్‌ కొట్టగా, ఉమ్రాన్‌ (19 నాటౌట్‌) 2 సిక్స్‌లు, ఒక ఫోర్‌  బాదాడు. సన్‌రైజర్స్‌ తన తదుపరి మ్యాచ్‌ను శుక్రవారం లక్నో వేదికగా లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్టుతో ఆడుతుంది. 

IPL 2023 SRH Vs RR Scorecard: స్కోరు వివరాలు 
రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: యశస్వి (సి) మయాంక్‌ (బి) ఫజల్‌ 54; బట్లర్‌ (బి) ఫజల్‌ 54; సామ్సన్‌ (సి) అభిషేక్‌ (బి) నటరాజన్‌ 55; పడిక్కల్‌ (బి) ఉమ్రాన్‌ 2; పరాగ్‌ (సి) ఫజల్‌ (బి) నటరాజన్‌ 7; హెట్‌మైర్‌ (నాటౌట్‌) 22; అశ్విన్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 203. వికెట్ల పతనం: 1–85, 2–139, 3–151, 4–170, 5–187. బౌలింగ్‌: భువనేశ్వర్‌ 3–0–36–0, ఫజల్‌ హఖ్‌ 4–0–41–2, సుందర్‌ 3–0–32–0, నటరాజన్‌ 3–0–23–2, ఆదిల్‌ రషీద్‌ 4–0–33–0, ఉమ్రాన్‌ 3–0–32–1. 

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: అభిషేక్‌ శర్మ (బి) బౌల్ట్‌ 0; మయాంక్‌ (సి) బట్లర్‌ (బి) చహల్‌ 27; త్రిపాఠి (సి) హోల్డర్‌ (బి) బౌల్ట్‌ 0; హ్యారీ బ్రూక్‌ (సి) చహల్‌ 13; సుందర్‌ (సి) హెట్‌మైర్‌ (బి) హోల్డర్‌ 1; ఫిలిప్స్‌ (సి) ఆసిఫ్‌ (బి) అశ్విన్‌ 8; సమద్‌ (నాటౌట్‌) 32; రషీద్‌ (స్టంప్డ్‌) సామ్సన్‌ (బి) చహల్‌ 18; భువనేశ్వర్‌ (బి) చహల్‌ 6; ఉమ్రాన్‌ (నాటౌట్‌) 19; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 131. వికెట్ల పతనం: 1–0, 2–0, 3–34, 4–39, 5–48, 6–52, 7–81, 8–95. బౌలింగ్‌: బౌల్ట్‌ 4–1–21–2, ఆసిఫ్‌ 3–0–15–0, హోల్డర్‌ 3–0–16–1, అశ్విన్‌ 4–0–27–1, చహల్‌ 4–0–17–4, నవదీప్‌ సైనీ 2–0–34–0.   

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు