Breaking News

చాలా బాధగా ఉంది.. అదే మా ఓటమికి కారణం! ప్రతీ సారి ఇంతే: ధావన్‌

Published on Thu, 05/18/2023 - 08:56

ఐపీఎల్‌-2023లో పంజాబ్‌ కింగ్స్‌ కథ దాదాపు ముగిసినట్లే. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ధర్మశాల వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలైన పంజాబ్‌.. ప్లే ఆఫ్స్‌ చేరే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. తప్పనిసారిగా గెలవాల్సిన మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో పంజాబ్‌ ఓటమి చవిచూసింది.

214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ 8 వికెట్లు కోల్పోయి 198 పరుగులు మాత్రమే చేయగల్గింది. లివింగ్‌స్టోన్‌(94) అద్బుత ఇన్నింగ్స్‌ ఆడినప్పటికీ తన జట్టును గెలిపించుకోలేపోయాడు. ఇక కీలక మ్యాచ్‌లో ఓటమిపై మ్యాచ్‌ అనంతరం పంజాబ్‌ కెప్టెన్సీ శిఖర్‌ ధావన్‌ స్పందించాడు. ఓటమికి కారణం తమ చెత్త బౌలింగే అని గబ్బర్‌ తెలిపాడు.

"కీలక మ్యాచ్‌లో ఓటమి పాలవ్వడం చాలా బాధగా ఉంది. మొదటి ఆరు ఓవర్ల(పవర్‌ప్లే)లో మేం బాగా బౌలింగ్‌ చేయలేదు. తొలుత పిచ్‌పై బంతి అద్బుతంగా స్వింగ్‌ అయింది. అటువంటి సమయంలో మా పేసర్లు వికెట్లు సాధించడంలో విఫలమయ్యారు. వికెట్ల విషయం పక్కన పెడితే కనీసం పరుగులనైనా కట్టడి చేసి ఉంటే బాగుండేది.

ఈ మ్యాచ్‌లోనే కాకుండా ప్రతీ మ్యాచ్‌లోనే మేం ఇంతే. పవర్‌ప్లేలో కనీసం 50-60 మధ్య పరుగులు సమర్పించుకుంటున్నాం.  అయితే ఈ మ్యాచ్‌లో మేము చాలా క్లోజ్‌గా వెళ్లి ఓడిపోయాం. ఆఖరి ఓవర్‌లో నోబాల్‌ తర్వాత మళ్లీ మా ఆశలు చిగురించాయి. కానీ దురదృష్టవశాత్తూ అది జరగలేదు. లివింగ్‌ స్టోన్‌ అద్బుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు.

బ్యాటింగ్‌లో కూడా మాకు మంచి ఆరంభం లభించలేదు. తొలి ఓవర్‌ మెయిడిన్‌, రెండో ఓవర్‌లో నేను ఔటయ్యాను. దాదాపు పవర్‌ప్లే మేమ 12 బంతులు వరకు వృథా చేశాము. ఇక ఆఖరి ఓవర్‌లో స్పిన్నర్‌తో బౌలింగ్ చేయంచాలన్న నా నిర్ణయం విఫలమైంది. అంతకు ముందు ఫాస్ట్‌బౌలర్లకు ఒకే ఓవర్‌లో 18-20 పరుగులు రాబట్టారు. కాబట్టి నేను స్పిన్నర్‌తో ముందుకు వెళ్లాను అని పోస్ట్‌మ్యాచ్‌ ప్రేజేంటేషన్‌లో ధావన్‌ పేర్కొన్నాడు.
చదవండి: IPL 2023: పంజాబ్‌ కొంపముంచిన ధావన్‌ చెత్త కెప్టెన్సీ.. అలా చేసి ఉంటే?

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)