IPL 2023: ఇంజక్షన్లు తీసుకున్నా.. అద్భుత ప్రభావం.. త్వరలోనే కలుస్తా

Published on Mon, 04/10/2023 - 16:08

IPL 2023- PBKS- Liam Livingstone: పంజాబ్‌ కింగ్స్‌కు శుభవార్త. పవర్‌ హిట్టర్‌, ఇంగ్లండ్‌ స్టార్‌ లియామ్‌ లివింగ్‌స్టోన్‌ త్వరలోనే జట్టుతో చేరనున్నాడు. ఈ విషయాన్ని లివింగ్‌స్టోన్‌ స్వయంగా వెల్లడించాడు. ఈ మేరకు.. ‘‘ గత రెండు నెలలుగా కఠిన పరిస్థితులు.. త్వరలోనే తిరిగి మైదానంలో అడుగుపెడతా.. త్వరలోనే మీతో చేరతా పంజాబ్‌ కింగ్స్‌’’ అని సోమవారం ట్వీట్‌ చేశాడు.

కాగా 11.50 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పంజాబ్‌ కింగ్స్‌ లివింగ్‌స్టోన్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే గాయం కారణంగా గతేడాది డిసెంబరు నుంచి ఆటకు దూరమైన అతడు ఇన్నాళ్లు చికిత్స తీసుకున్నాడు. 


లియామ్‌ లివింగ్‌స్టోన్‌ (PC: IPL)

ఇంజక్షన్లు తీసుకున్నా
ఈ క్రమంలో కోలుకున్న లివింగ్‌స్టోన్‌ లంకాషైర్‌ క్రికెట్‌ టీవీ ఇంటర్వ్యూలో ఆదివారం మాట్లాడుతూ.. ‘‘గత వారం ఇంజక్షన్లు తీసుకున్నా. అవి అద్భుతమైన ప్రభావం చూపాయి. రానున్న 48 గంటల్లో ఇండియాకు పయనమవుతా’’ అని పేర్కొన్నాడు. 

ఈ నేపథ్యంలో ట్విటర్‌ వేదికగా మరోసారి అప్‌డేట్‌ ఇచ్చాడు. దీంతో పంజాబ్‌ ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. పవర్‌ హిట్టర్‌ వస్తే తమ బ్యాటింగ్‌ ఆర్డర్‌ బలం పెరుగుతుందని పేర్కొంటున్నారు. కాగా ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల సత్తా లివింగ్‌స్టోన్‌ సొంతమని ఇప్పటికే పలుమార్లు రుజువైన విషయం తెలిసిందే.

పవర్‌ హిట్టర్‌ వచ్చేస్తున్నాడు..
ఇక 29 ఏళ్ల లివింగ్‌స్టోన్‌ 2017లో సౌతాఫ్రికాతో టీ20మ్యాచ్‌తో ఇంగ్లండ్‌ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. 2021లో వన్డే, 2022లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు మొత్తంగా ఒక టెస్టులో 16 పరుగులు, 12 వన్డేల్లో 250 పరుగులు, 20 టీ20లలో 423 పరుగులు సాధించాడు.

ఇదిలా ఉంటే.. తొలి రెండు మ్యాచ్‌లలో విజయం సాధించిన పంజాబ్‌ కింగ్స్‌.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో పరాజయం పాలైంది. ప్రస్తుతం ధావన్‌ సేన పాయింట్ల పట్టికలో ఆరోస్థానంలో ఉంది.  పంజాబ్‌ తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్‌ 13న గుజరాత్‌ టైటాన్స్‌తో తలపడనుంది. అన్నీ కుదిరితే ఈ మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్‌ ఆడే అవకాశం ఉంది.

చదవండి: 4 ఓవర్లలో 69 పరుగులు; తలెత్తుకో చాంపియన్‌.. కేకేఆర్‌ ట్వీట్‌ వైరల్‌! ఎవరీ యశ్‌ దయాల్‌? 
IPL 2023: హర్షా బోగ్లేకు ధావన్‌ అదిరిపోయే కౌంటర్‌! నవ్వుతూనే చురకలు! 

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)