Breaking News

Rohit Sharma: భవిష్యత్తు ఆ ఇద్దరిదే.. హార్ధిక్‌, బుమ్రాల్లాగా..!

Published on Thu, 05/25/2023 - 11:33

ముంబై ఇండియన్స్‌ సారధి రోహిత్‌ శర్మ.. తమ యువ కెరటాలు తిలక్‌ వర్మ, నేహల్‌ వధేరాలపై ప్రశంసల వర్షం కురిపించాడు. వీరిని భవిష్యత్తు సూపర్‌ స్టార్‌ ప్లేయర్లుగా అభివర్ణించాడు. గత సీజన్‌లో తిలక్‌, ఈ సీజన్‌లో నేహల్‌ తమకు దొరికిన ఆణిముత్యాలని కొనియాడాడు. ఈ సీజన్‌లో ఇద్దరు అదరగొట్టారని ఆకాశానికెత్తాడు. 

మిడిలార్డర్‌లో నేహాల్ (12 మ్యాచ్‌ల్లో 214 పరుగులు) మ్యాచ్ విన్నర్‌గా మారాడని, తిలక్ (9 మ్యాచ్‌ల్లో 274 పరుగులు) తనకు లభించిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముంబై అభిమానుల దృష్టిలో హీరోలా తయారయ్యాడని అన్నాడు. 

హార్ధిక్‌ పాండ్యా, జస్ప్రీత్‌ బుమ్రాలు ముంబై ఇండియన్స్‌కు ఆడుతూనే సత్తా చాటి, స్టార్లుగా ఎదిగారని.. తిలక్‌, నేహల్‌ల తీరు చూస్తుంటే వీరు కూడా పెద్ద స్టార్లుగా మారేలా ఉన్నారని అభిప్రాయపడ్డాడు. తిలక్‌, నేహల్‌లు ముంబై ఇండియన్స్‌కే కాకుండా భవిష్యత్తులో టీమిండియా సూపర్‌స్టార్లుగా  ఎదుగుతారని జోస్యం చెప్పాడు.

వచ్చే రెండేళ్లలో తేడాను మీరు చూస్తారని తిలక్‌, నేహల్‌లపై విశ్వాసం వ్యక్తం చేశాడు. ముంబై ఇండియన్స్‌ని సూపర్‌స్టార్‌ టీమ్‌ అంటారు. కానీ మేము ఇక్కడ స్టార్లను తయారు చేస్తున్నామని ప్రగల్భాలు పలికాడు.

ఇదిలా ఉంటే, నిన్న (మే 25) జరిగిన ఐపీఎల్‌ 2023 ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌.. లక్నో సూపర్‌ జెయింట్స్‌ను 81 పరుగుల భారీ తేడాతో ఓడించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. కామెరాన్‌ గ్రీన్‌ (23 బంతుల్లో 41; 6 ఫోర్లు, 1 సిక్స్‌), సూర్యకుమార్‌ యాదవ్‌ (20 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. అనంతరం ఆకాశ్‌ మధ్వాల్‌ (3.3-0-5-5) ధాటికి లక్నో 16.3 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌటైంది. స్టొయినిస్‌ (27 బంతుల్లో 40; 5 ఫోర్లు, 1 సిక్స్‌) మినహా అంతా విఫలమయ్యారు. కనీసం పూర్తి ఓవర్లు కూడా ఆడలేకపోయిన లక్నో 21 బంతుల ముందే కుప్పకూలింది.

చదవండి: సపోర్ట్‌ బౌలర్‌గా వచ్చాడు.. అతనిలో టాలెంట్‌ ఉందని ముందే పసిగట్టాను: రోహిత్‌ శర్మ

Videos

అమెరికా గోల్డెన్ డోమ్.. అంతరిక్షంలో ఆయుధాలు

మావోయిస్ట్ పార్టీని ఊచకోత కోస్తోన్న ఆపరేషన్ కగార్

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

పిఠాపురం నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హెల్త్ సెక్రటరీ

ఆవకాయ కోసం యూరప్ నుంచి ఇండియాకు వచ్చిన విదేశీయులు

మా కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసాడు.. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఫైర్..

కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

Photos

+5

కేన్స్‌లో అదితి ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా మురిపించింది (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)