Breaking News

చెత్తగా ప్రవర్తించారు.. నితీశ్‌ రాణాకు బీసీసీఐ షాక్‌! సూర్యకు భారీ జరిమానా

Published on Mon, 04/17/2023 - 08:51

BCCI Punishes Nitish Rana- Hrithik Shokeen- Suryakumar Fined: ముంబై ఇండియన్స్‌ తాత్కాలిక కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయనందున ఈ టీమిండియా టీ20 స్టార్‌కు 12 లక్షల జరిమానా పడింది. కాగా ఐపీఎల్‌-2023లో భాగంగా ముంబై వేదికగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో ఆదివారం ముంబై ఇండియన్స్‌ తలపడింది.

రోహిత్‌ స్థానంలో సారథిగా
ముంబై రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అస్వస్థతకు గురైన నేపథ్యంలో అతడి స్థానంలో సూర్య సారథిగా వ్యవహరించాడు. ఈ క్రమంలో స్లో ఓవర్‌ రేటు మెయింటెన్‌ చేసిన కారణంగా ఐపీఎల్‌ నిర్వాహకులు ఈ మేర ఫైన్‌ విధించారు. 

ఇక సొంత మైదానంలో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌.. కేకేఆర్‌ను 186 పరుగులకు కట్టడి చేసింది. వెంకటేశ్‌ అయ్యర్‌ సెంచరీ(104)తో మెరవడంతో కోల్‌కతా ఈ మేరకు స్కోరు చేసింది.

ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా
ఈ క్రమంలో లక్ష్య ఛేదనలో భాగంగా రోహిత్‌ శర్మ(20) ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా ఓ మోస్తరుగా రాణించగా.. మరో ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ హాఫ్‌ సెంచరీ(58)తో చెలరేగాడు. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ 43 పరుగులతో రాణించగా.. తిలక్‌ వర్మ 30, టిమ్‌ డేవిడ్‌ 24(నాటౌట్‌) పరుగులు చేశారు. దీంతో 17.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన ముంబై ఈ సీజన్‌లో వరుసగా రెండో విజయం నమోదు చేసింది.

నితీశ్‌ రాణా మ్యాచ్‌ ఫీజులో కోత..
ముంబై బౌలర్‌ హృతిక్‌ షోకీన్- కేకేఆర్‌ కెప్టెన్‌ నితీశ్‌ రాణా మధ్య వివాదం నేపథ్యంలో ఇద్దరికీ జరిమానా విధించారు ఐపీఎల్‌ నిర్వాహకులు. మైదానంలో పరస్పరం అనుచితంగా ప్రవర్తించినందుకు గానూ ఇరువురి మ్యాచ్‌ ఫీజులో కోత విధించారు. ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళిలోని 2.21 నిబంధనను అతిక్రమించినందుకు గానూ నితీశ్‌ రాణా ఫీజులో 25 శాతం కోత పెట్టారు.

ముంబై బౌలర్‌కూ ఫైన్‌
అదే విధంగా.. హృతిక్‌ షోకీన్‌.. ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళిలోని 2.5 నిబంధనను ఉల్లంఘించినందుకు మ్యాచ్‌ ఫీజులో 10 శాతం కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాగా నితీశ్‌ రాణా, హృతిక్‌ షోకీన్‌ దేశవాళీ క్రికెట్‌లో ఒకే జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

వీరిద్దరు ఢిల్లీ తరఫున ఆడుతూ సహచర ఆటగాళ్లుగా కొనసాగుతున్నారు. ఐపీఎల్‌లో వేర్వేరు జట్లకు ఆడుతున్న ఈ ఇద్దరు అనవసరపు గొడవతో చెత్తగా ప్రవర్తించి క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహానికి గురయ్యారు. తమ తప్పులు అంగీకరించి బీసీసీఐ విధించిన ఫైన్‌ రూపంలో మూల్యం కూడా చెల్లించుకున్నారు.

చదవండి: వెంకీ శతకం.. 'కింగ్‌' ఖాన్‌ కూతురు ఏం చేసిందంటే?
#venkateshIyer: నొప్పిని భరిస్తూనే.. 

Videos

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)