Breaking News

స్నిన్నర్ల విజృంభణ.. ఆర్‌సీబీపై కేకేఆర్‌ ఘన విజయం

Published on Thu, 04/06/2023 - 19:13

కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఓటమి పాలైంది. 205 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ 123 పరుగులకే ఆలౌటై 81 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. అయితే ఒక దశలో 95 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది. ఈ దశలో ఆకాశ్‌ దీప్‌(8 బంతుల్లో 17), డేవిడ్‌ విల్లే(20 బంతుల్లో 20 నాటౌట్‌)లు మెరుపు ఇన్నింగ్స్‌ ఆడడంతో ఆర్‌సీబీ పరువు నిలబడింది. లేకుంటే వంద పరుగులలోపే ఆలౌటై ఘోర పరాజయాన్నే మూటగట్టుకునేదే. డుప్లెసిస్‌ 23 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. కేకేఆర్‌ బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి నాలుగు వికెట్లు తీయగా.. సుయాశ్‌శర్మ మూడు, సునీల్‌ నరైన్‌ రెండు వికెట్లు, శార్దూల్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు.

ఓటమి దిశగా ఆర్‌సీబీ.. 86 పరుగులకే 8 వికెట్లు డౌన్‌
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ 86 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది.

టార్గెట్‌ 205.. 54కే నాలుగు వికెట్లు కోల్పోయిన ఆర్‌సీబీ
205 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆర్‌సీబీ కష్టాల్లో పడింది. 8 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసింది. బ్రాస్‌వెల్‌ ఆరు, షాదాబ్‌ అహ్మద్‌ క్రీజులో ఉన్నారు.


Photo Credit : IPL Website

శార్దూల్‌, రింకూ సింగ్‌ మెరుపులు.. ఆర్‌సీబీ టార్గెట్‌ 205
శార్దూల్‌ ఠాకూర్‌(29 బంతుల్లో 69,9 ఫోర్లు, 3 సిక్సర్లు), రింకూ సింగ్‌(33 బంతుల్లో 46 పరుగులు) విధ్వంసం సృష్టించడంతో కేకేఆర్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోరు చేసింది. అంతకముందు రహమనుల్లా గుర్బాజ్‌ 57 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఆర్‌సీబీ బౌలర్లలో డేవిడ్‌ విల్లే, కర్ణ్‌ శర్మలు చెరో రెండు వికెట్లు తీయగా.. సిరాజ్‌, హర్షల్‌ పటేల్‌, ఆకాశ్‌దీప్‌లు తలా ఒక వికెట్‌ తీశారు.


Photo Credit : IPL Website

శార్దూల్‌ దూకుడు.. 16 ఓవర్లలో కేకేఆర్‌ 147/5
ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో దూకుడు ప్రదర్శిస్తుండడంతో కేకేఆర్‌ 16 ఓవర్లు ముగిసేసరికి ఐదు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. శార్దూల్‌ 19 బంతుల్లో 47, రింకూ సింగ్‌ 21 పరుగులతో ఆడుతున్నారు.


Photo Credit : IPL Website

94 పరుగులకే ఐదు వికెట్లు
ఆర్‌సీబీతో మ్యాచ్‌లో కేకేఆర్‌ కష్టాల్లో పడింది. 94 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. కర్ణ్‌ శర్మ వరుస బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టాడు. 


Photo Credit : IPL Website

9 ఓవర్లలో కేకేఆర్‌ 71/3
9 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్‌ మూడు వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది. ఓపెనర్‌ రహమనుల్లా గుర్బాజ్‌ 47 పరుగులతో ఆడుతున్నాడు. 


Photo Credit : IPL Website

వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయిన కేకేఆర్‌
ఆర్‌సీబీతో మ్యాచ్‌లో కేకేఆర్‌ వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. డేవిడ్‌ విల్లే ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్లో వరుస బంతుల్లో వెంకటేశ్‌ అయ్యర్‌(3), మణిదీప్‌(0) పెవిలియన్‌ చేర్చాడు. ప్రస్తుతం కేకేఆర్‌ 4 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 26 పరుగులు చేసింది.


​​​​​​​Photo Credit : IPL Website

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఏంచుకున్న ఆర్‌సీబీ
ఐపీఎల్ 16వ సీజ‌న్ 9వ మ్యాచ్‌లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్త‌ల‌ప‌డుతున్నాయి. ఈడెన్స్ గార్డెన్ వేదిక‌గా జ‌రుగుతున్న ఈ మ్యాచ్‌లో కేకేఆర్ విజ‌యంపై క‌న్నేసింది. టాస్‌ గెలిచిన ఆర్‌సీబీ ఫీల్డింగ్‌ ఏంచుకుంది.

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): మన్‌దీప్ సింగ్, రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్‌ కీపర్‌), నితీష్ రాణా(కెప్టెన్‌), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, సుయాష్ శర్మ, టిమ్ సౌతీ, ఉమేష్ యాదవ్, వరుణ్ చకరవర్తి

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్‌), దినేష్ కార్తీక్ (వికెట్‌ కీపర్‌), గ్లెన్ మాక్స్‌వెల్, మైకేల్ బ్రేస్‌వెల్, షాబాజ్ అహ్మద్, డేవిడ్ విల్లీ, కర్ణ్ శర్మ, హర్షల్ పటేల్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్

తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్‌ను చిత్తు చేసిన ఆర్సీబీ జోరు కొన‌సాగించాల‌ని భావిస్తోంది. సొంత గ‌డ్డ‌పై గెలిచి, టోర్న‌మెంట్‌లో బోణీ కొట్టాల‌ని నితీశ్ రానా సేన ప‌ట్టుద‌ల‌తో ఉంది. ముంబైపై హాఫ్ సెంచ‌రీతో చెల‌రేగిన విరాట్ కోహ్లీ, కెప్టెన్ డూప్లెసిస్ ఈ మ్యాచ్‌లోనూ రాణిస్తే ఆర్సీబీకి తిరుగుండ‌దు. స‌మిష్టిగా సత్తా చాట‌డంపై కేకేఆర్ విజ‌యావ‌కాశాలు ఆధార‌ప‌డి ఉన్నాయి.

Videos

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)