Breaking News

ఇది మనకు అలవాటేగా.. పాపం కావ్యా మారన్‌!

Published on Sun, 04/02/2023 - 19:28

ఐపీఎల్‌లో సీజన్లు మారుతున్నాయే తప్ప ఎస్‌ఆర్‌హెచ్‌ ఆటలో మాత్రం మార్పు రావడం లేదు. జట్టును ఎన్ని రకాలుగా ప్రక్షాళన చేసినా మా ఆట ఇంతే అన్నట్లుగా ఆటతీరు కనబరుస్తూ సీజన్‌.. సీజన్‌కు మరింత దారుణంగా తయారవుతోంది. అయితే ఎస్‌ఆర్‌హెచ్‌ పేరు చెప్పగానే ఫ్రాంచైజీ ఓనర్‌ కావ్యా మారన్‌ మొహం గుర్తుకురాక మానదు. ఎస్‌ఆర్‌హెచ్‌ ఆడే ప్రతీ మ్యాచ్‌కు హాజరవుతూ వారిని ఉత్సాహపరుస్తూ ఉంటుంది. కానీ ఆమె చూపించే ఉత్సాహాన్ని ఎస్‌ఆర్‌హెచ్‌ తమ చెత్త ఆటతీరుతో నీరుగారుస్తుంది.

తాజాగా ఐపీఎల్‌ 16వ సీజన్‌లోనూ ఎస్‌ఆర్‌హెచ్‌ ఆటతీరు మారలేదు. కోట్లు పెట్టి కొన్ని హ్యారీ బ్రూక్‌, గ్లెన్‌ పిలిప్స్‌లు ఏదో పొడిచేస్తారనుకుంటే ఏం చేయకుండానే ఔటయ్యారు. అయితే ఎస్‌ఆర్‌హెచ్‌ జట్టు ఎప్పుడు ఎక్కువగా బౌలింగ్‌నే నమ్ముకొని బరిలోకి దిగుతుంది. కానీ ఈసారి బౌలర్లు కూడా తేలిపోయారు. హోంగ్రౌండ్‌లో ఒక జట్టు మ్యాచ్‌ ఆడుతుందంటే ఎంతోకొంత ఫెవరెట్‌గా కనిపిస్తోంది.

కానీ ఎస్‌ఆర్‌హెచ్‌ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తుంది. ఆదివారం రాజస్తాన్‌ విధించిన 204 పరుగుల టార్గెట్‌ను చేధించే క్రమంలో కనీసం పోరాడాలన్న విషయాన్ని కూడా మరిచిపోయినట్లుంది. ఏదో మొక్కుబడిగా ఆడుతున్నామా అన్నట్లుగా బ్యాటర్లు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. భారీ లక్ష్యంతో బరిలోకి వంద పరుగులు చేయడానికి అష్టకష్టాలు పడింది.​  కావ్యా మారన్‌ వేలంలో ఏరికోరి ఆటగాళ్లను తీసుకుంటే జట్టును నట్టేట ముంచారు. ఇలాంటి బ్యాటింగ్‌తో ఎస్‌ఆర్‌హెచ్‌ కప్‌ కొట్టడం కూడా కష్టమే. 

ఇక ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటింగ్‌ చూసి పాపం కావ్యా మారన్‌ మొహం మాడిపోయింది. అయినా గత రెండు సీజన్లుగా ఎస్‌ఆర్‌హెచ్‌ ఆటతీరు ఇలానే ఉన్నప్పటికి కావ్యా మారన్‌ మాత్రం ప్రతీ మ్యాచ్‌కు హాజరై వారిని ఉత్సాహపరుస్తూనే ఉంది. అయినా మన పిచ్చి కానీ.. ఎస్‌ఆర్‌హెచ్‌కు ఇది అలవాటే కదా.. పాపం కావ్యా మారన్‌కు ఈ విషయం అర్థమైనా ఏం చేయలేని పరిస్థితి. ఆమెను చూస్తే జాలేస్తోంది.

చదవండి: పాతది గుర్తొచ్చిందేమో.. చేయాలనుకొని చేయలేకపోయాడు

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)