పంజాబ్‌కు గుడ్‌న్యూస్‌.. అతడు వచ్చేశాడు! హైదరాబాద్‌కు చేరుకున్నధావన్‌ సేన

Published on Fri, 04/07/2023 - 19:49

IPL 2023- Punjab Kings- Liam Livingstone- Kagiso Rabada: వరుస విజయాలతో జోరు మీదున్న పంజాబ్‌ కింగ్స్‌కు శుభవార్త. సౌతాఫ్రికా స్టార్‌ పేసర్‌ కగిసో రబడ భారత్‌కు వచ్చేశాడు. జట్టుతో కలిసి హైదరాబాద్‌కు చేరుకున్నాడు. అదే విధంగా ధావన్‌ సేనకు సంబంధించిన మరో కీలక అప్‌డేట్‌ బయటకు వచ్చింది. భారీ మొత్తం వెచ్చించి కింగ్స్‌ కొనుగోలు చేసిన ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ లియామ్‌ లివింగ్‌స్టోన్‌ రాకకోసం మాత్రం మరికొన్ని రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇంకా కోలుకోలేదు
మోకాలి గాయం కారణంగా రిహాబిలిటేషన్‌ సెంటర్‌లో ఉన్న లివింగ్‌స్టోన్‌ ఇంకా పూర్తి కోలుకోలేదని ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. ఓల్డ్‌ ట్రఫోర్డ్‌లో చికిత్స పొందుతున్న లివింగ్‌స్టోన్‌ ఏప్రిల్‌ 15 తర్వాతే భారత్‌కు వెళ్లే అవకాశం ఉందని క్రిక్‌బజ్‌తో పేర్కొన్నారు.

కాగా గాయం కారణంగా గతేడాది డిసెంబరు నుంచి లియామ్‌ లివింగ్‌స్టోన్‌ ఆటకు దూరమయ్యాడు. ఈ క్రమంలో రిహాబిలిటేషన్‌ సెంటర్‌లో ఉన్న అతడు.. ఏప్రిల్‌ మొదటి వారంలోనే పంజాబ్‌ కింగ్స్‌తో చేరతాడనే వార్తలు వచ్చాయి.

అయితే, తాజా సమాచారం ప్రకారం అతడి రాక మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. సౌతాఫ్రికా స్టార్‌ బౌలర్‌ కగిసో రబడ మాత్రం తదుపరి మ్యాచ్‌లో అందుబాటులోకి రానున్నాడు. కాగా ఏప్రిల్‌ 9న పంజాబ్‌ కింగ్స్‌ హైదరాబాద్‌ వేదికగా.. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో తలపడనుంది.

హైదరాబాద్‌కు చేరుకున్న ధావన్‌ సేన
ఈ నేపథ్యంలో ధావన్‌ సేన.. హైదరాబాద్‌కు చేరుకుంది. సంప్రదాయ పద్ధతిలో గబ్బర్‌ బృందానికి స్వాగతం లభించింది. కాగా పంజాబ్‌ కింగ్స్‌ ఐపీఎల్‌-2023 సీజన్‌ను ఘనంగా ఆరంభించింది. తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై 7 పరుగుల తేడాతో గెలుపొందిన పంజాబ్‌.. రెండో మ్యాచ్‌లో రాజస్తాన్‌పై 5 పరుగుల తేడాతో విజయం సాధించింది.

స్వల్ప తేడాలతో గెలుపొంది పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. కాగా 11.50 కోట్ల రూపాయల భారీ మొత్తం చెల్లించి పంజాబ్‌ లివింగ్‌స్టోన్‌ను దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక రబడ కోసం 9.25 కోట్లు ఖర్చు చేసింది. 

చదవండి: ఎందుకు వస్తున్నాడో తెలియదు.. చెత్త బ్యాటింగ్‌! ప్రతీసారి ఇంతే
కోహ్లి వచ్చాడు.. కోపంగా బ్యాట్‌ విసిరేశాడు.. పక్కనే కూర్చున్న నాతో.. 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)