Breaking News

ఏడాదిలో ఎంత మార్పు.. జాస్‌ బట్లర్‌ చెత్త రికార్డు

Published on Fri, 05/19/2023 - 22:38

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌ జాస్‌ బట్లర్‌ అనుకున్న రీతిలో రాణించడం లేదు. గతేడాది ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్‌ క్యాప్‌ హోల్డర్‌గా నిలిచిన బట్లర్‌ ఐపీఎల్‌ 2023లో మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు.  ఈ సీజన్‌లో ఒకటి రెండు మ్యాచ్‌లు మినహా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.

తాజాగా శుక్రవారం పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో బట్లర్‌ డకౌట్‌ అయ్యాడు. రబాడ వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ నాలుగో బంతికి ఎల్బీగా వెనుదిరిగాడు. ఈ క్రమంలో బట్లర్‌ అత్యంత చెత్త రికార్డు నమోదు చేశాడు. ఈ సీజన్‌లో బట్లర్‌ డకౌట్‌గా వెనుదిరగడం ఇది ఐదోసారి.

ఒక సీజన్‌లో అత్యధిక సార్లు డకౌట్‌ అయిన తొలి బ్యాటర్‌గా బట్లర్‌ నిలిచాడు. ఇంతకముందు ఒక ఐపీఎల్‌ సీజన్‌లో ఒక బ్యాటర్‌ నాలుగుసార్లు మాత్రమే డకౌట్‌ అయ్యాడు. తాజాగా బట్లర్‌ డకౌట్ల చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.  ఇంతకముందు హర్షలే గిబ్స్‌(2009, డెక్కన్‌ చార్జర్స్‌), మిథున్‌ మన్హస్‌(2011, పుణే వారియర్స్‌), మనీష్‌ పాండే(2012, పుణే వారియర్స్‌), శిఖర్‌ ధావన్‌(2020, ఢిల్లీ క్యాపిటల్స్‌), ఇయాన్‌ మోర్గాన్‌(2021,కేకేఆర్‌), నికోలస్‌ పూరన్‌(2021, పంజాబ్‌ కింగ్స్‌) నాలుగేసి సార్లు డకౌట్‌ అయ్యారు.

చదవండి: #JiteshSharma: పంజాబ్‌ తరపున కొత్త సిక్సర్ల వీరుడు

స్థిరత్వం లేని బ్యాటింగ్‌.. పైగా వెకిలి నవ్వొకటి!


 

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)