Breaking News

శుభ్‌మన్‌ గిల్‌కు ఆరెంజ్‌ క్యాప్‌.. అయితే గుజరాత్‌ టైటిల్‌ గెలవడం కష్టం..! 

Published on Sat, 05/27/2023 - 08:23

ఐపీఎల్‌-2023లో భాగంగా నిన్న (మే 26) జరిగిన క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో ముంబైని ఓడించడం ద్వారా గుజరాత్‌ టైటాన్స్‌ వరుసగా రెండో సీజన్‌లో ఫైనల్లోకి అడుగుపెట్టింది. శుభ్‌మన్‌ గిల్‌ సుడిగాలి శతకం (60 బంతుల్లో 129; 7 ఫోర్లు, 10 సిక్సర్లు) సాధించి, గుజరాత్‌ గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. ఈ క్రమంలో గిల్‌ ఆరెంజ్‌ క్యాప్‌ను (సీజన్‌లో అత్యధిక పరుగులు) కూడా సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 16 మ్యాచ్‌లు ఆడిన గిల్‌ 60.79 సగటున, 156.43 స్ట్రయిక్‌ రేట్‌తో 3 శతకాలు, 4 అర్ధశతకాల సాయంతో 851 పరుగులు చేశాడు. 

గిల్‌ ఆరెంజ్‌ క్యాప్‌ సొంతం చేసుకుని, గుజరాత్‌ ఫైనల్‌కు చేరిన తర్వాత ఓ ఆసక్తికర విషయం నెట్టింట ట్రోల్‌ అవుతుంది. అదేంటంటే.. ఆరెంజ్‌ క్యాప్‌ గెలిచిన ఆటగాళ్ల జట్టు ఐపీఎల్‌ టైటిల్‌ను కేవలం రెండు పర్యాయాలు మాత్రమే గెలవడం. 2014లో కేకేఆర్‌ ఆటగాడు రాబిన్‌ ఉతప్ప ఆరెంజ్‌ క్యాప్‌ హోల్డర్‌గా ఉప్పప్పుడు కేకేఆర్‌, 2021లో సీఎస్‌కే ఓపెనర్‌ రుతురాజ్‌ ఆరెంజ్‌ క్యాప్‌ గెలిచినప్పుడు సీఎస్‌కే టైటిల్‌ విన్నర్లుగా నిలిచాయి. 

ఈ క్రమంలో సెంటిమెంట్లను ఎక్కువగా ఫాలో అయ్యే క్రికెట్‌ అభిమానులు.. శుభ్‌మన్‌ గిల్‌ ఆరెంజ్‌ క్యాప్‌ హోల్డర్‌గా ఉంటాడు కాబట్టి, ఈసారి గుజరాత్‌ టైటిల్‌ గెలవదని దాదాపుగా ఫిక్స్‌ అయిపోయారు. మరికొందరేమో.. గుజరాత్‌ సెంటిమెంట్లను తిరగరాసి, చరిత్ర సృష్టిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి సెంటిమెంట్‌ రిపీట్‌ అవుతుందో లేక సెంటిమెంట్‌ను బ్రేక్‌ చేసి గుజరాత్‌ చరిత్ర సృష్టిస్తుందో వేచి చూడాలి.

కాగా, నిన్న జరిగిన క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌.. 62 పరుగుల తేడాతో ముంబైని మట్టికరిపించింది. శుభ్‌మన్‌ గిల్‌ విధ్వంసకర శతకంతో (60 బంతుల్లో 129; 7 ఫోర్లు, 10 సిక్సర్లు) విరుచుకుపడటంతో గుజరాత్‌ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 233 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. అనంతరం ఛేదనలో తడబడిన ముంబై.. మోహిత్‌ శర్మ (5/10) ధాటికి 18.2 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది.  

                  ఆరెంజ్‌క్యాప్‌ విన్నర్‌                               విజేత

  1. షాన్‌ మార్ష్‌ (పంజాబ్‌, 616 పరుగులు, 2008)-రాజస్థాన్‌ రాయల్స్‌
  2. మాథ్యూ హేడెన్‌ (సీఎస్‌కే, 572, 2009)-డెక్కన్‌ ఛార్జర్స్‌
  3. సచిన్‌ టెండూల్కర్‌ (ముంబై, 618, 2010)-సీఎస్‌కే
  4. క్రిస్‌ గేల్‌ (ఆర్సీబీ, 608, 2011)-సీఎస్‌కే
  5. క్రిస్‌ గేల్‌ (ఆర్సీబీ, 733, 2012)-కేకేఆర్‌
  6. మైఖేల్‌ హస్సీ (సీఎస్‌కే, 733, 2013)-ముంబై
  7. రాబిన్‌ ఉతప్ప (కేకేఆర్‌, 660, 2014)-కేకేఆర్‌
  8. డేవిడ్‌ వార్నర్‌ (సన్‌రైజర్స్‌, 562, 2015)-ముంబై
  9. విరాట్‌ కోహ్లి (ఆర్సీబీ, 973, 2016)-సన్‌రైజర్స్‌
  10. డేవిడ్‌ వార్నర్‌ (సన్‌రైజర్స్‌, 641, 2017)-ముంబై
  11. కేన్‌ విలియమ్సన్‌ (సన్‌రైజర్స్‌, 735, 2018)-సీఎస్‌కే
  12. డేవిడ్‌ వార్నర్‌ (సన్‌రైజర్స్‌, 692, 2019)-ముంబై
  13. కేఎల్‌ రాహుల్‌ (పంజాబ్‌, 670, 2020)-ముంబై
  14. రుతురాజ్‌ గైక్వాడ్‌ (సీఎస్‌కే, 635, 2021)-సీఎస్‌కే
  15. జోస్‌ బట్లర్‌ (రాజస్థాన్‌, 863, 2022)-గుజరాత్‌

చదవండి: శుబ్‌మన్‌ సూపర్‌ సెంచరీ.. ఫైనల్లో గుజరాత్‌ టైటాన్స్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)