Breaking News

IPL 2023 GT Vs CSK: అహ్మదాబాద్‌లో భారీ వర్షం.. మ్యాచ్‌ జరుగుతుందా?

Published on Fri, 03/31/2023 - 12:38

శుక్రవారం ఐపీఎల్‌ 16వ సీజన్‌ అట్టహాసంగా ప్రారంభం కానుంది. ప్రారంభ వేడుకలకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఇప్పటికే సిద్ధమైంది. ఇక సీజన్‌ తొలి మ్యాచ్‌ డిపెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌, సీఎస్‌కేల మధ్య జరగనుంది. అయితే అభిమానులకు ఒక బ్యాడ్‌న్యూస్‌. మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. దీంతో సీజన్‌లో తొలి మ్యాచ్‌ జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి.  

అహ్మదాబాద్ లో గురువారం భారీ వర్షం కురిసింది. అసలు ఊహించని రీతిలో హఠాత్తుగా వాతావరణం మారిపోయి భారీ వర్షం కురవడంతో చెన్నై, గుజరాత్ టీమ్స్ ప్రాక్టీస్ సెషన్ లను రద్దు చేశారు. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురవడంతో ఐపీఎల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు ఇది నిరాశ కలిగించే అంశం. మ్యాచ్ సమయానికి కూడా ఇలాగే వర్షం పడితే ఎలా అని ఆందోళన చెందుతున్నారు. 

అయితే శుక్రవారం ఉదయం నుంచి అహ్మదాబాద్‌లో వర్షం పడలేదు. పైగా ఎండ బాగానే కాస్తోంది.  అయితే శుక్రవారం వర్షం పడే అవకాశాలు అసలు లేవని.. ఒకవేళ ఉన్నా చిరుజల్లులు మాత్రమే కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే కొన్ని రోజులుగా ఉత్తర, పశ్చిమ భారతదేశంలో ఊహించని రీతిలో సడెన్ గా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సాయంత్రానికి కల్లా పరిస్థితి ఇలాగే ఉంటే మ్యాచ్ సజావుగా జరుగుతుంది. 

ఇక ప్రారంభవేడుకలను ఐపీఎల్‌ నిర్వాహకులు ఘనంగా నిర్వహించనున్నారు. టాలీవుడ్‌ హీరోయిన్స్‌ రష్మిక మందన్నా, తమన్నా భాటియా, సింగర్ అరిజిత్ సింగ్ తమ ప్రదర్శనతో అలరించనున్నారు. అయితే తొలి మ్యాచ్ కు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ అందుబాటులో ఉండేది అనుమానంగా ఉంది. అతడు మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. ఒకవేళ ధోని ఆడకపోతే చెన్నై కెప్టెన్సీ బాధ్యతలు ఎవరు తీసుకుంటారన్నది చూడాలి.

స్టోక్స్, జడేజా, రుతురాజ్ గైక్వాడ్ రేసులో ఉన్నారు. మరోవైపు ఛాంపియన్స్‌ హోదాలో బరిలోకి దిగుతున్న గుజరాత్‌ టైటాన్స్‌ సీఎస్‌కేపై నెగ్గి తమ ఆధిపత్యం చూపించాలని ఉవ్విళ్లూరుతుంది. గత సీజన్‌లో గుజరాత్‌తో తలపడిన రెండు సందర్భాల్లోనూ సీఎస్‌కేకు ఓటమే ఎదురయ్యింది.

చదవండి: IPL 2023: హోంగ్రౌండ్‌లో ఢిల్లీ ఆడే మ్యాచ్‌లకు పంత్‌!

IPL 2023: తెర వెనుక నాయకులను చూసేద్దామా.. 

Videos

విజనరీ ముసుగులో చంద్రబాబు స్కాముల చిట్టా.. పక్కా ఆధారాలతో..

ట్రంప్ సర్కారుకు షాక్

లిక్కర్ స్కామ్ డైరెక్టర్.. బాబుకు టెన్షన్ పెట్టిస్తున్న ఈనాడు ప్రకటన..

తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ కలవరం

యాపిల్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక

నా లేఖ లీక్ వెనుక పెద్ద కుట్ర ఉంది..

బెంగళూరుపై హైదరాబాద్ విజయం

అప్పుల కుప్ప అమరావతి

హరికృష్ణకు పోలీసుల వేధింపులపై YS జగన్ ఫైర్

వల్లభనేని వంశీని చంపేస్తారా..!

Photos

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)