Breaking News

'#Ee sala Cup Nahi'.. జట్టు కెప్టెన్‌ అయ్యుండి ఆ మాట అనొచ్చా!

Published on Sat, 04/01/2023 - 19:04

ఐపీఎల్‌లో మోస్ట్‌ అన్‌లక్కీ జట్టు ఏదైనా ఉందంటే అది రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టే. ప్రతీ సీజన్‌లో పేపర్‌పై బలంగా కనిపించే ఆర్‌సీబీ అసలు ఆటలో మాత్రం తేలిపోతుంది. ఒత్తిడిలో ఆడదన్న పేరును మూటగట్టుకున్న ఆర్‌సీబీ మరో సౌతాఫ్రికా జట్టులా తయారైంది.  ఈ సాలా కప్‌ నమ్‌ దే(ఈసారి కప్‌ మనదే) అంటూ ప్రతీసారి ఊదరగొట్టే ఆర్‌సీబీ ఆ కలను మాత్రం నెరవేర్చుకోలేకపోతుంది.

తాజాగా ప్రారంభమైన ఐపీఎల్‌ 16వ సీజన్‌కు ఆర్‌సీబీ నూతనోత్సాహంతో సిద్ధమైంది. ఏప్రిల్‌ 2న ముంబై ఇండియన్స్‌తో తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఈ నేపథ్యంలో జట్టు కెప్టెన్‌ పాఫ్‌ డుప్లెసిస్‌ జట్టు కూర్పు గురించి.. ఈ సీజన్‌లో తాము ఆడబోయే గేమ్‌ స్ట్రాటజీ గురించి ప్రమోషన్‌ ఈవెంట్‌లో మాట్లాడాడు. ఈ మీటింగ్‌కు కోహ్లి కూడా హాజరయ్యాడు. 

అయితే ​కెప్టెన్‌ డుప్లెసిస్‌ చర్య సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆర్‌సీబీ స్లోగన్‌ ఈ సాలా కప్‌ నమ్‌దేను డుప్లెసిస్‌ తప్పుగా చెప్పాడు.  కోహ్లి అతని చెవిలో ఈ సాలా కప్‌ నమ్‌దే అని చెప్పాడు. కానీ డుప్లెసిస్‌కు ఈ సాలా కప్‌ వరకు అర్థమైంది కానీ చివరి పదం అర్థం కాలేదు. దీంతో ఈ సాలా కప్‌ నహీ(ఈసారి కప్పు రాదు) అని తప్పుగా చెప్పేశాడు. దీంతో షాక్‌ తిన్న కోహ్లి డుప్లెసిస్‌ మాటలకు పగలబడి నవ్వుకున్నాడు. ఆ తర్వాత కోహ్లి మరోసారి చెప్పడంతో డుప్లెసిస్‌ ఈసారి మాత్రం ఈ సాలా కప్‌ నమ్‌దే అంటూ కరెక్ట్‌గా చెప్పాడు.

ఈ చర్య ఆర్‌సీబీ అభిమానులను కాస్త భయానికి గురి చేసింది. కానీ ఐపీఎల్‌లో ఉన్న మిగిలిన జట్ల అభిమానులు మాత్రం  #Ee Sala Cup Nahi.. హ‍్యాష్‌ట్యాగ్‌ క్రియేట్‌ చేసి డుప్లెసిస్‌ను ట్రోల్‌ చేశారు. ''కెప్టెన్‌ అయ్యుండి అంత మాట అంటావా''..'' నిజమేలే.. ఈసారి కూడా మీకు కప్పు ఎలాగో రాదు.. అందుకే నీ నోటి నుంచి ఆ మాట వచ్చింది''..'' ముందే ఫిక్స్‌ అయినట్టున్నారు కప్‌ రాదని'' అంటూ కామెంట్‌ చేశారు. 

ఐపీఎల్‌లో ఆర్‌సీబీ ఇప్పటి వరకు మూడుసార్లు రన్నరప్‌గా నిలిచింది. అయితే 2016 తర్వాత ఆర్‌సీబీ మూడేళ్ల పాటు ఆఖరి స్థానాల్లో నిలుస్తూ వచ్చింది. అయితే 2020 నుంచి మాత్రం ఆర్‌సీబీ ఆటలో దూకుడు పెరిగింది. గతేడాది ఐపీఎల్‌లో ఎలిమినేటర్‌లో లక్నోను ఇంటికి పంపించి రెండో క్వాలిఫయర్‌ ఆడిన ఆర్‌సీబీ రాజస్తాన్‌ చేతిలో ఖంగుతిని ఇంటిబాట పట్టింది.

చదవండి: అరుదైన రికార్డు.. కోహ్లిని సమం చేసిన గబ్బర్‌

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)