amp pages | Sakshi

IPL 2023: ‘ధోని పూర్తి ఫిట్‌గా ఉన్నాడు.. మరో మూడు, నాలుగేళ్లు ఐపీఎల్‌ ఆడతాడు’

Published on Mon, 03/20/2023 - 08:44

Will MS Dhoni Retire From IPL In 2023?: మహేంద్ర సింగ్‌ ధోని.. ఐపీఎల్‌-2023 తర్వాత రిటైర్‌ అవుతాడా? తలా అభిమానులను వేధిస్తున్న ప్రశ్న. మిస్టర్‌ కూల్‌ ధోనికి ఇదే ఆఖరి సీజన్‌ అన్న అంచనాల నేపథ్యంలో ఈ అంశంపై క్రీడావర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఈ ఏడాది వేలంలో ఇంగ్లండ్‌ సారథి బెన్‌స్టోక్స్‌ను చెన్నై సూపర్‌ కింగ్స్‌ సొంతం చేసుకోవడంతో.. అతడిని కెప్టెన్‌ను చేసి ధోని ఇక విశ్రాంతి తీసుకుంటాడనే సంకేతాలు వచ్చాయి. 

ఈ క్రమంలో స్టోక్స్‌ జట్టుపై పూర్తిగా పట్టు సాధించిన తర్వాత పగ్గాలు అతడికి అప్పజెప్పి తలా రిటైర్‌ అవుతాడనే వార్తలు వినిపించాయి. ఈ విషయంపై సీఎస్‌కే ఫాస్ట్‌బౌలర్‌ దీపక్‌ చహర్‌కు ప్రశ్న ఎదురుకాగా అతడు ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ‘‘ధోనికి ఐపీఎల్‌లో ఇదే చివరి ఏడాది అని ఎవరు చెప్పారు. నిజానికి ఆయన కూడా స్వయంగా ఎప్పుడూ ఈ మాట అనలేదు.

నాకు తెలిసి ధోని ఇంకొన్నాళ్లు ఆడతాడు. ఆడాలని కోరుకుంటున్నా కూడా! ఎప్పుడు రిటైర్‌ అవ్వాలో ధోనికి బాగా తెలుసు. టెస్టు క్రికెట్‌కు, తర్వాత అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికే సమయంలో ధోని తీసుకున్న నిర్ణయాలు మనమంతా చూశాం కదా! నేనైతే ధోని ఇంకొన్నాళ్లు ఆడతాడనే అనుకుంటున్నా. ఆయన సారథ్యంలో.. ఆయనతో కలిసి క్రికెట్‌ ఆడటమనే నా కల నెరవేరినందుకు సంతోషంగా ఉన్నా.

ధోని ఇప్పటికీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈసారి ఐపీఎల్‌లో తలా బ్యాటింగ్‌ చూస్తే మీకే ఆ విషయం అర్థమవుతుంది. ధోని రిటైర్మెంట్‌ గురించి మాకైతే అస్సలు ఐడియా లేదు’’ అని దీపక్‌ చహర్‌ న్యూ ఇండియా స్పోర్ట్స్‌తో వ్యాఖ్యానించాడు. 

మరో మూడు, నాలుగేళ్లు..
ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ షేన్‌ వాట్సన్‌ సైతం ధోని ఐపీఎల్‌ కెరీర్‌ గురించి స్పందిస్తూ.. ‘‘ధోనికి ఇదే ఆఖరి సీజన్‌ అని నేను విన్నాను. నా దృష్టిలో మాత్రం మరో మూడు నాలుగేళ్ల పాటు క్రికెట్‌ ఆడగల సత్తా ధోనికి ఉంది. ఇప్పటికీ తను ఫిట్‌గా ఉన్నాడు. అద్భుతంగా వికెట్‌ కీపింగ్‌ చేస్తున్నాడు.

తనొక గొప్ప నాయకుడు. సీఎస్‌కే విజయవంతం కావడానికి ప్రధాన కారణం అతడి కెప్టెన్సీనే. నాకు తెలిసి ధోనికి ఇదే ఆఖరి ఐపీఎల్‌ కాదు.. అతడు ఇంకొంత కాలం కొనసాగుతాడు’’ అని ఏఎన్‌ఐతో పేర్కొన్నాడు.  కాగా టీమిండియాకు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన ధోని.. ఐపీఎల్‌లో చెన్నై జట్టును నాలుగుసార్లు చాంపియన్‌గా నిలిపిన విషయం తెలిసిందే.

చదవండి: Ind Vs Aus 2nd ODI: ఘోర ఓటమి.. టీమిండియా చెత్త రికార్డులివే! మరీ దారుణంగా.. 
IND vs AUS: అతడు లేకపోవడం వల్లే టీమిండియాకు ఓటమి.. లేదంటేనా ఆసీస్‌కు చుక్కలే

Videos

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)