Breaking News

ధావన్‌ దెబ్బకు రిటైర్డ్‌హర్ట్‌.. ఐపీఎల్‌కు దూరమయ్యే చాన్స్‌!

Published on Wed, 04/05/2023 - 20:50

రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ విధ్వంసక ఆటగాడు బానుక రాజపక్స్‌ రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. అశ్విన్‌ బౌలింగ్‌లో కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ కొట్టిన స్ట్రెయిట్‌ షాట్‌ రాజపక్స మోచేతికి బలంగా తాకింది. దీంతో నొప్పితో రాజపక్స విలవిల్లాడిపోయాడు. ఇన్నింగ్స్‌ 11వ ఓవర్‌ తొలి బంతికి ఇది చోటుచేసుకుంది.

ఫిజియో వచ్చి రాజపక్సను పరిశీలించగా.. చేయి వాచిపోయింది. దీంతో బ్యాట్‌ పట్టుకోవడం కష్టమవడంతో రాజపక్స రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. బంతి చేతికి బలంగా తాకడంతో గాయం తీవ్రత ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. ముందుగా రాజపక్సకు స్కానింగ్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. రిపోర్ట్‌లో పాజిటివ్‌ వస్తే రాజపక్స ఐపీఎల్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. ఇదే జరిగితే పంజాబ్‌కు ఇది కోలుకోలేని దెబ్బ అని చెప్పొచ్చు.

అంతకముందు ప్రబ్‌సిమ్రన్‌ సింగ్‌ 34 బంతుల్లోనే 60 పరుగులు సాధించి పంజాబ్‌ను పటిష్ట స్థితిలో నిలిపాడు. రాజస్తాన్‌ బౌలర్లను చీల్చి చెండాడిన ప్రబ్‌సిమ్రన్‌ మైదానం నలువైపులా షాట్లు ఆడి తన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. కాగా ప్రబ్‌సిమ్రన్‌కు ఐపీఎల్‌లో ఇదే తొలి అర్థశతకం కావడం విశేషం.

చదవండి: రాజస్తాన్‌ బౌలర్లను ఉతికారేశాడు.. ఎవరీ ప్రబ్‌సిమ్రన్‌ సింగ్‌

Videos

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు