Breaking News

ఎయిడెన్‌ అన్న, బ్రూక్‌ వల్లే ఇదంతా! సాకులు వెతుక్కోవద్దన్న లారా.. బ్యాటర్లపై ఫైర్‌!

Published on Sat, 04/08/2023 - 10:02

Lucknow Super Giants vs Sunrisers Hyderabad: ‘‘వరుసగా వికెట్లు కోల్పోవడం తీవ్ర ప్రభావం చూపుతోంది. తొలి మ్యాచ్‌లో మొదటి ఓవర్లోనే వికెట్లు కోల్పోయాం. ఈరోజు ఏడు బంతుల వ్యవధిలోనే మూడు వికెట్లు పడ్డాయి. దీంతో మ్యాచ్‌ స్వరూపం మొత్తం మారిపోయింది. కచ్చితంగా మా బ్యాటర్ల ఆట తీరు మెరుగుపడాల్సి ఉంది. 

లోపాలు సరిచేసుకుంటేనే అనుకున్న ఫలితాలు రాబడుతూ ముందుకు సాగే వీలు ఉంటుంది’’ అని సన్‌రైజర్స్‌ హెడ్‌కోచ్‌ బ్రియన్‌ లారా అన్నాడు. ఐపీఎల్‌-2023లో బ్యాటర్ల దారుణ వైఫల్యమే తొలి రెండు మ్యాచ్‌లలో ఓటములకు కారణమైందని పేర్కొన్నాడు. 

పేలవమైన ప్రదర్శనతో రైజర్స్‌ వరుస ఓటములు
ఇప్పటికైనా తమ బ్యాటింగ్‌ విభాగం పొరపాట్లు సరిచేసుకోవాలని, ఆ మేరకు కావాల్సిన చర్యలు చేపడతామని లారా వెల్లడించాడు. కాగా ఐపీఎల్‌-2022 సీజన్‌ను ఎనిమిదో స్థానంతో ముగించిన సన్‌రైజర్స్‌.. పదహారో ఎడిషన్‌నూ పేలవంగా ఆరంభించింది.

సొంతగడ్డపై రాజస్తాన్‌ రాయల్స్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో ఘోర పరాజయం పాలైన రైజర్స్‌... శుక్రవారం నాటి మ్యాచ్‌లోనూ చేతులెత్తేసింది. లక్నో సూపర్‌ జెయింట్స్‌ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ రెండు మ్యాచ్‌లలోనూ బ్యాటర్ల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనపడింది. 

ఎయిడెన్‌ అన్న.. హ్యారీ బ్రూక్‌ మరీ ఘోరంగా
తొలి మ్యాచ్‌లో టాపార్డర్‌ పూర్తిగా విఫలం కాగా.. లక్నోలో మ్యాచ్‌లో 50/1తో పర్వాలేదనిపించినా.. కేవలం నాలుగు పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోవడం దెబ్బకొట్టింది. భారీ అంచనాల నడుమ బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్కరమ్‌ గోల్డెన్‌ డకౌట్‌ కాగా.. హ్యారీ బ్రూక్‌(3) మరోసారి పూర్తిగా నిరాశపరిచాడు.

ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 121 పరుగులు చేసి స్వల్ప లక్ష్యం విధించిన హైదరాబాద్‌ జట్టుపై రాహుల్‌ సేన ఘన విజయం సాధించింది. 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించడంతో రైజర్స్‌ ఖాతాలో వరుసగా రెండో ఓటమి వచ్చి చేరింది. 

వాళ్లిద్దరు అవుట్‌ అవడం దెబ్బతీసింది
ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం లారా మాట్లాడుతూ.. అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌ అవుటైన తర్వాత.. కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్కరమ్‌, హ్యారీబ్రూక్‌ వెనువెంటనే పెవిలియన్‌ చేరడం తమను చావు దెబ్బతీసిందన్నాడు. కనీసం 150- 160 పరుగులు చేస్తే పరిస్థితి వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. పిచ్‌ను నిందిస్తూ ఓటమికి సాకులు వెతుక్కోబోమని.. తమ బ్యాటింగ్‌ విభాగం మెరుగుపడాల్సి ఉందని లారా చెప్పుకొచ్చాడు.

చదవండి: టెస్టులాడేటోడిని ఐపీఎల్‌ ఆడిస్తే ఇలానే ఉంటుంది! 
ఎవరు బాబు నీవు.. వెళ్లి టెస్టులు ఆడుకో పో! అక్కడ కూడా పనికి రాడు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)