Breaking News

ఒక్కడే పోరాడితే సరిపోదు.. జట్టు మొత్తం ఆడితేనే!

Published on Sat, 04/08/2023 - 20:09

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ హ్యాట్రిక్‌ ఓటములను చవిచూసింది. రాజస్తాన్‌ రాయల్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 57 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మరి ఢిల్లీ ఓటములకు కారణాలు విశ్లేషిస్తే ప్రధానంగా బ్యాటింగ్‌ వైఫల్యమే వారి ఓటములకు కారణం అని చెప్పొచ్చు. 

తాజాగా రాజస్తాన్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్‌ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ 65 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. అతనికి అండగా నిలబడేవారే కరువయ్యారు. మధ్యలో లలిత్‌ యాదవ్‌ 38 పరుగులతో నిలకడగా ఆడినప్పటికి అతను ఔట్‌ అయిన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌ వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది.


Photo: IPL Twitter

అయితే ఆఖరి వరకు నిలబడినప్పటికి జట్టు బ్యాటర్ల నుంచి మద్దతు లేనప్పుడు వార్నర్‌ మాత్రం ఏం చేయగలడు. అలా చివరికి వార్నర్‌ 65 పరుగుల వద్ద ఎల్బీగా వెనుదిరిగాడు. అప్పటికే ఢిల్లీ ఓటమి ఖరారైపోయింది.  ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలింగ్‌ మోస్తరుగా ఉన్నప్పటికి బ్యాటింగ్‌ ఆర్డర్‌ మాత్రం సరిగ్గా లేదని చెప్పొచ్చు.

లక్నోతో ఆడిన తొలి మ్యాచ్‌లో చేజింగ్‌లో విఫలమైంది. లక్నో ఇచ్చిన 194 పరుగుల టార్గెట్‌ను చేధించలేక 143 పరుగుల వద్దే ఆగిపోయింది. ఇక గుజరాత్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ భారీ స్కోరు చేయడంలో విఫలమైంది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగుల సాధారణ స్కోరుకే పరిమితమైంది. బలమైన బ్యాటింగ్‌ లైనఫ్‌ కలిగి ఉన్న గుజరాత్‌ 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది.

ఇక మూడో మ్యాచ్‌లో చేజింగ్‌లో మరోసారి విఫలమైంది. చాలా స్లోగా ఆడుతున్నాడంటూ వార్నర్‌పై విమర్శలు వచ్చాయి. కానీ అదే వార్నర్‌ లేకపోతే ఇవాళ ఢిల్లీ ఘోర ఓటమిని చవిచూసేది. అయినా ఒక మ్యాచ్‌లో కెప్టెన్‌ ఒక్కడే ఆడితే సరిపోదు.. జట్టులోని మిగతా ఆటగాళ్లు కూడా తమ వంతు బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తేనే విజయం వరిస్తుంది. కనీసం వచ్చే మ్యాచ్‌లోనైనా ఇది తెలుసుకొని ఢిల్లీ బ్యాటర్లు జట్టుకు తొలి విజయాన్ని అందించాలని కోరుకుందాం.

చదవండి: David Warner: అత్యంత వేగంగా.. కోహ్లి, ధావన్‌ల రికార్డు బద్దలు

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)