Breaking News

IPL 2023: ఈ సాలా కప్‌ నమదే, రాసి పెట్టుకోండి.. లక్కీ మ్యాన్‌ మాతోనే ఉన్నాడు..!

Published on Tue, 05/02/2023 - 16:08

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ప్రారంభమైన నాటి నుండి 'ఈ సాలా కప్‌ నమదే'.. ఈ సాలా కప్‌ నమదే అంటూ ఆర్సీబీ అభిమానులు హడావుడి చేయడం చూస్తూనే ఉన్నాం. 15 సీజన్లు అయిపోయినా ఆ జట్టు ఇంతవరకు ఒక్క టైటిల్‌ కూడా సాధించింది లేదు కానీ, ఆ జపం మాత్రం వదలడం లేదు. 2009, 2011, 2016 సీజన్లలో ఫైనల్‌కు చేరినా ఆర్సీబీకి అదృష్టం కలిసి రాలేదు. ప్రస్తుత సీజన్‌లోనూ ఆర్సీబీ అభిమానులు అదే స్లోగన్‌ చెప్తూ ఊదరగొడుతున్నారు.

ప్రస్తుత సీజన్‌లో వారికి అశించిన ఫలితాలు రాకపోయినా, చెత్త జట్టుతో  (KGFS (కోహ్లి,మ్యాక్సీ, డుప్లెసిస్‌,సిరాజ్‌) మినహా) అతి కష్టం మీద నెట్టుకొస్తున్నా ఆర్సీబీ ఫ్యాన్స్‌ మాత్రం ఈ సాలా కప్‌ నమదే అని ధీమాగా చెబుతున్నారు. పైగా నిన్న (మే 1) లక్నోపై విజయానంతరం వారి వాయిస్‌లో బేస్‌ పెరిగింది. ఈ సాలా కప్‌ నమదే అంటూ ఇంకా గట్టిగా వాదిస్తున్నారు. వారి కాన్ఫిడెన్స్‌కు కారణం ఏంటని ఆరా తీస్తే.. చాలామంది ఓ ఆటగాడి పేరు చెబుతున్నారు. అతడే ఆర్సీబీ వెటరన్‌ స్పిన్నర్‌ కర్ణ్‌ శర్మ.

కర్ణ్‌ శర్మ ఎక్కడ ఉంటే ఆ జట్టు టైటిల్‌ గెలవడం మనం చూశాం. ఇతగాడు 2016 (సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌), 2017 (ముంబై ఇండియన్స్), 2018 (సీఎస్‌కే), 2021 (సీఎస్‌కే) సీజన్లలో వివిధ విన్నింగ్‌ టీమ్‌లలో భాగంగా ఉన్నాడు. ఐపీఎల్‌లో కర్ణ్‌ శర్మను మోస్ట్‌ లక్కీయెస్ట్‌ పర్సన్‌గా పేరుంది. ఆర్సీబీ అభిమానులు ప్రస్తుతం కర్ణ్‌ శర్మ సెంటిమెంట్‌ పైనే గంపెడాశలు పెట్టుకున్నారు. పైగా ప్రత్యర్ధులు ఈ ఏడాది తమను తక్కువ అంచనా వేయడం కూడా కలిసొస్తుందని వారు భావిస్తున్నారు.

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో (9 మ్యాచ్‌ల్లో 5 విజయాలు) ఉన్న ఆర్సీబీ.. తదుపరి మ్యాచ్‌ల్లో వరుస విజయాలు సాధించి, ఆ తర్వాత టైటిల్‌ కూడా సాధించి తీరుతుందని ఆర్సీబీ ఫ్యాన్స్‌  నమ్మకంగా ఉన్నారు. ఈ సాలా కప్‌ నమదే.. రాసి పెట్టుకోండి అంటూ సోషల్‌మీడియాను హోరెత్తిస్తున్నారు. మరోవైపు ఆర్సీబీ వ్యతిరేకులు మాత్రం ఆర్సీబీకి అంత సీన్‌ లేదని, కర్ణ్‌ శర్మ గతేడాది కూడా వారితోనే ఉన్నాడు, అప్పుడు కానిది ఇప్పుడెలా కుదురుతుందని పంచ్‌లు వేస్తున్నారు.

మరికొందరైతే దినేశ్‌ కార్తీక్‌, షాబాజ్‌ అహ్మద్‌ లాంటి దిగ్గజాలను జట్టులో ఉంచుకుని టైటిల్‌ సాధించాలనుకోవడం అత్యాశే అవుతుందని సెటైర్లు వేస్తున్నారు. మరి ఫ్యాన్స్‌ నమ్మకాన్ని ఆర్సీబీ నీలబెడుతుందో, నీరుగారుస్తుందో వేచి చూడాలి.

Videos

గడువు పెరుగుతుందా..? నామినేషన్లపై సుప్రీం ఏం చెప్పనుంది..?

టీడీపీ దౌర్జన్యకాండ.. YSRCP అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకోవాలని పిలుపు..

నా ఫ్యామిలీని కాపాడండి.. YSRCP అభ్యర్థి షేక్ ఇమామ్ విజ్ఞప్తి

నీకు దమ్ముంటే.. రా, లోకేశ్‌కు వైసీపీ దాసరి అరుణ బహిరంగ సవాల్!

సారా అర్జున్ సినిమాలు ఎందుకు తగ్గించింది? అసలు కారణం ఇదేనా?

లోకేశ్ బంపర్ ఆఫర్.. రౌడీయిజం చేస్తేనే మంత్రి పదవి లేకపోతే మీ పవర్ కట్..

ఇంట్లో ఉన్న YSRCP MPTC అభ్యర్థిని లాక్కెళ్లిన SI విజయ్

టీడీపీ గూండాలకు పోలీసులు కొమ్ముకాశారు... ఎవరినీ వదిలిపెట్టం

ధర పెరిగిందని పాత బంగారం అమ్మితే లాభమా? నష్టమా? అసలు లెక్క ఇదే

నేనేంటో చూపిస్తా.. బాబుకు దీప్తి రెడ్డి మాస్ వార్నింగ్

Photos

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)