Breaking News

Pat Cummins: ఐపీఎల్‌ ఆపాలనేది సరైన జవాబు కాదు

Published on Thu, 04/29/2021 - 16:45

అహ్మదాబాద్‌: కేకేఆర్‌ స్టార్‌ బౌలర్‌.. ఆసీస్‌ పేసర్‌ పాట్‌ కమిన్స్‌ కరోనా బాధితుల కోసం 50వేల ఆస్ట్రేలియన్‌ డాలర్లు విరాళంగా ఇచ్చి పెద్ద మనసు చాటుకున్న సంగతి తెలిసిందే. దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ కేన్‌ రిచర్డ్‌సన్‌, ఆడమ్‌ జంపా, లివింగ్‌ స్టోన్‌, ఆండ్రూ టై లాంటి విదేశీ ఆటగాళ్లు బయోబబుల్‌లో ఉండలేమంటూ లీగ్‌ను విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఈ పరిస్థితుల్లో ఐపీఎల్‌ను నిలిపివేయాలని సోషల్‌ మీడియా వేదికగా పలువురు కోరుతున్నారు. ఈ విషయంపై పాట్‌ కమిన్స్‌ స్పందించాడు.

''మేము ఐపీఎల్‌ ఆడుతున్నామంటే ఇక్కడ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామనేది మాకు తెలుసు. బయోబబుల్‌లో ఉంటూ క్రికెట్‌ ఆడడం మాకు అలవాటుగా మారిపోయింది. అయినా మేము రోజు మూడు నుంచి నాలుగు గంటలపాటు మాత్రమే మైదానంలో ఉంటూ ఆటలో మజాను అందిస్తున్నాం. బయట కరోనా విజృంభిస్తున్న వేళ ప్రజలంతా ఇంట్లోనే ఉంటూ ఐపీఎల్‌ మ్యాచ్‌లను వీక్షిస్తున్నారు. మా వల్ల వారికి హాని జరగకపోగా.. మేలు జరుగుతుంది. ఒక రోజులో మూడు నాలుగు గంటల పాటు మా ఆటను ఎంజాయ్‌ చేస్తూ టీవీలకే అతుక్కుపోతున్నారు. సమస్య ఇంకెక్కడ ఉంది. మేం చేస్తున్న ఈ పనికి ఐపీఎల్‌ను ఆపాలని చెప్పడం కరెక్ట్‌ కాదు'' అని చెప్పుకొచ్చాడు.

కాగా పాట్‌ కమిన్స్‌ ఐపీఎల్‌లో కేకేఆర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. 2020 ఐపీఎల్‌ వేలంలో కమిన్స్‌ను రూ. 16 కోట్లకు కేకేఆర్‌ కొనులు చేసింది. ఇక ఈ సీజన్‌లో ఇప్పటివరకు 5 మ్యాచ్‌లాడి 82 పరుగలతో పాటు 4 వికెట్లు తీశాడు. ఇక సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో పాట్‌ కమిన్స్‌ సంచలన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. సిక్సర్ల జడివాన సృష్టించిన కమిన్స్‌ ఒకదశలో కేకేఆర్‌ను విజయంవైపు నడిపించాడు. ఆ మ్యాచ్‌లో కమిన్స్‌ కేవ‌లం 34 బంతుల్లోనే క‌మిన్స్ 66 ప‌రుగులతో విధ్వంసం సృష్టించాడు.

చదవండి: చప్పట్లు సరిపోవు.. ఘనంగా సత్కరించండి

కరోనా: పాట్‌ కమిన్స్‌ ఔదార్యం, ఐపీఎల్‌పై కీలక సూచన

Videos

కవిత లెటర్ పై KTR షాకింగ్ రియాక్షన్

ఈనాడు పత్రికపై వైఎస్ జగన్ వ్యాఖ్యలు వైరల్

కవిత లేఖ కల్లోలం.. కేటీఆర్ సంచలన ప్రెస్ మీట్

YSR జిల్లాలో విషాదం

వంశీ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యుల ఆందోళన

YSRCP హరికృష్ణ ను చంపడానికి ప్రయత్నం

నా భర్తను కాపాడండి.. హరికృష్ణ భార్య ఎమోషనల్

విజనరీ ముసుగులో చంద్రబాబు స్కాముల చిట్టా.. పక్కా ఆధారాలతో..

ట్రంప్ సర్కారుకు షాక్

లిక్కర్ స్కామ్ డైరెక్టర్.. బాబుకు టెన్షన్ పెట్టిస్తున్న ఈనాడు ప్రకటన..

Photos

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)