Breaking News

కేకేఆర్‌తో మ్యాచ్‌ అంత ఈజీ ఏం కాదు: రోహిత్‌ శర్మ

Published on Thu, 09/23/2021 - 11:46

Rohit Sharma Comments On KKR: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌ అంత సులువేమీ కాదని ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. ఐపీఎల్‌-2021 రెండో అంచెలో భాగంగా తమ తొలి మ్యాచ్‌లో గెలుపుతో ఊపు మీదున్న కేకేఆర్‌ను కట్టడి చేయాలంటే తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డాడు. కాగా ముంబై ఇండియన్స్‌, కేకేఆర్‌ మధ్య గురువారం మ్యాచ్‌ జరుగనున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజా సీజన్‌ రెండో దశ చెన్నై సూపర్‌కింగ్స్‌, ముంబై మధ్య మ్యాచ్‌తో సెప్టెంబరు 19న పునః ప్రారంభమైన సంగతి తెలిసిందే.

ఈ మ్యాచ్‌లో రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా లేకుండానే బరిలో దిగిన ముంబై పరాజయం పాలైంది. బౌలర్లు అందించిన చక్కటి శుభారంభాన్ని వినియోగించుకోలేక కెప్టెన్‌ కీరన్‌ పొలార్డ్‌ పెద్ద తప్పిదమే చేశాడని చెప్పవచ్చు. ఫలితంగా ఓటమితో ముంబై ప్రయాణం మొదలైంది. మరోవైపు.. పటిష్ట స్థితిలో ఉన్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు వంటి అద్భుతమైన జట్టుపై 9 వికెట్ల తేడాతో గెలుపొందిన కేకేఆర్‌ జోరు మీద ఉంది. దీంతో నేటి మ్యాచ్‌లో మోర్గాన్‌ సేన రెట్టించిన ఉత్సాహంతో మైదానంలో దిగేందుకు సిద్ధమవుతోంది.

ఈ నేపథ్యంలో ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాట్లాడుతూ.. ‘‘కేకేఆర్‌ మెరుగైన స్థితిలో ఉంది. గత మ్యాచ్‌లో సమిష్టిగా రాణించింది. విజయం సాధించింది. సహజంగానే పూర్తి ఆత్మవిశ్వాసంతో రంగంలోకి దిగుతుంది. కాబట్టి.. నేటి మ్యాచ్‌ మాకు అంత ఈజీ ఏం కాదు’’ అని అభిప్రాయపడ్డాడు. గత రికార్డులపై తనకు నమ్మకం లేదని, టీ20 మ్యాచ్‌లో సదరు రోజు ప్రదర్శన ఎలా ఉందన్న అంశం మీదనే గెలుపోటములు ఆధారపడి ఉంటాయని హిట్‌మ్యాన్‌ పేర్కొన్నాడు.

‘‘మ్యాచ్‌ జరిగే రోజు అత్తుత్యమ ప్రదర్శన కనబరిస్తే చాలు. తప్పకుండా విజయం వరిస్తుందని నమ్ముతాను. కేకేఆర్‌ మీద మా రికార్డు బాగుందనేది వాస్తవం. కాబట్టి.. ప్రయత్నలోపం లేకుండా కృషి చేస్తే అనుకున్న ఫలితాలు రాబట్టే అవకాశం ఉంటుంది. అంతే తప్ప గత రికార్డులతో పెద్ద సంబంధం ఉండదని భావిస్తాను’’ అని రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై తమ సోషల్‌ మీడియా అకౌంట్‌లో షేర్‌ చేసింది. కాగా ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ముంబై- కోల్‌కతా జట్లు 28 సార్లు ముఖాముఖి తలపడ్డాయి. ఇందులో 22 సార్లు ముంబై గెలవగా.. కేవలం ఆరు సార్లే కోల్‌కతా విజయం సాధించింది.

Videos

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య ఎమోషనల్..

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్

రేపట్నుంచి ఐపీఎల్ పునఃప్రారంభం

Liquor Case: రాజకీయ కక్ష అని తేలితే...? సుప్రీం సీరియస్

Miss World 2025: అందం అంటే..!

మాట నిలబెట్టుకున్న జగన్.. ఆర్మీ జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి 25 లక్షల చెక్

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్ రిప్లై

సమంత లవ్ స్టోరీలో బిగ్ ట్విస్ట్?

ప్రపంచానికి మన సత్తా ఏంటో కళ్లకు కట్టేలా చూపించాం

తిరుమల శ్రీవారికి భారీ విరాళం

Photos

+5

నెల్లూరులో ప్రసిద్ధ ఆలయం..శనివారం ఒక్కరోజే భక్తులకు దర్శనం (ఫొటోలు)

+5

'వచ్చినవాడు గౌతమ్‌' సినిమా టీజర్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

సుందరీమణుల మనస్సు దోచిన 'పోచంపల్లి చీరలు'..ఫ్యాషన్ షో అదరహో (ఫొటోలు)

+5

సరస్వతి పుష్కరాలు.. కాళేశ్వరంలో సీఎం రేవంత్‌ పర్యటన (ఫొటోలు)

+5

Miss World 2025 : యాదగిరిగుట్ట, పోచంపల్లిలో మిస్‌ వరల్డ్‌ బ్యూటీస్‌ సందడి (ఫొటోలు)

+5

బర్త్ డే పార్టీ ఫోటోలు షేర్ చేసిన యాంకర్ రష్మీ గౌతమ్ (ఫొటోలు)

+5

డ్యాన్సింగ్‌ క్వీన్‌ 'మాధురీ దీక్షిత్‌' బర్త్‌డే.. ఈ విషయాలు తెలుసా?

+5

నిఖిల్‌ సిద్ధార్థ్ పెళ్లికి ఐదేళ్లు.. భార్యకు స్పెషల్ విషెస్ (ఫొటోలు)

+5

తెలంగాణ : సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభం (ఫొటోలు)

+5

అనంతపురంలో కుండపోత వర్షం.. వరద నీటిలో ప్రజల ఇక్కట్లు (ఫొటోలు)