ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు టీమిండియాకు గాయాల బెడద.. ప్రత్యామ్నాయ ఆటగాళ్ల ప్రకటన

Published on Mon, 06/16/2025 - 17:35

ఈ నెల 24 నుంచి ఇంగ్లండ్‌తో జరుగబోయే మల్టీ ఫార్మాట్‌ సిరీస్‌కు ముందు భారత అండర్‌-19 జట్టుకు గాయాల బెడద పట్టుకుంది. ఈ సిరీస్‌కు ఎంపికైన ఇద్దరు కీలక ఆటగాళ్లు (ఆదిత్య రాణా, ఖిలన్‌ పటేల్‌) బీసీసీఐ హై పెర్ఫార్మెన్స్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణా శిబిరంలో గాయపడ్డారు. 

ఆదిత్య వెన్ను భాగంలో స్ట్రెస్‌ ఫ్రాక్చర్‌కు గురి కాగా.. ఖిలన్‌ పటేల్‌ కుడి కాలి గాయానికి గురయ్యాడు. వీరిద్దరు ఇం​గ్లండ్‌ పర్యటనకు వెళ్లరని బీసీసీఐ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. వీరికి ప్రత్యామ్నాయంగా దీపేశ్‌, నమన్‌ పుష్పక్‌లకు ఎంపిక చేసింది. దీపేశ్‌, పుష్పక్‌ ఇదివరకే ప్రకటించిన భారత జట్టు స్టాండ్‌ బై ప్లేయర్ల జాబితాలో ఉన్నారు.

కాగా, ఇంగ్లండ్‌తో జరుగబోయే మల్టీ ఫార్మాట్‌ సిరీస్‌ కోసం భారత కెప్టెన్‌గా ఐపీఎల్‌ హీరో ఆయుశ్‌ మాత్రే (సీఎస్‌కే) ఎంపికయ్యాడు. ఈ జట్టులో మరో ఐపీఎల్‌ చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ (రాజస్థాన్‌ రాయల్స్‌) కూడా చోటు దక్కించుకున్నాడు. ఈ సిరీస్‌లలో వైభవ్‌.. మాత్రేతో కలిసి భారత ఇన్నింగ్స్‌లు ప్రారంభిస్తాడు. 

వైభవ్‌ తాజాగా జరిగిన ఓ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో 90 బంతుల్లో 190 పరుగులు చేసి వార్తల్లో నిలిచాడు. ఇంగ్లండ్‌ పర్యటనలో భారత్ ఓ 50 ఓవర్ల వార్మప్‌ మ్యాచ్‌, 5 వన్డేలు, రెండు మల్టీ డే మ్యాచ్‌లు (టెస్ట్‌లు) ఆడుతుంది.

ఇంగ్లండ్‌ పర్యటన కోసం ఎంపిక చేసిన భారత అండర్‌-19 జట్టు: ఆయుశ్‌ మాత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, మౌల్యరాజ్‌సిన్హ్ చావ్డా, రాహుల్ కుమార్, అభిజ్ఞాన్ కుందు (వైస్-కెప్టెన్ & వికెట్‌కీపర్‌), హర్వాన్ష్ సింగ్ (వికెట్‌కీపర్‌), ఆర్‌ ఎస్‌ అంబరీష్, కనిష్క్ చౌహాన్, నమన్ పుష్పక్, హెనిల్‌ పటేల్, యుద్దజిత్‌ గుహా, ప్రణవ్‌ రాఘవేంద్ర, మొహమ్మద్‌ ఎనాన్‌, దీపేశ్‌, అన్మోల్జీత్ సింగ్

స్టాండ్‌బై ప్లేయర్స్: వేదాంత్ త్రివేది, వికల్ప్ తివారీ, అలంకృత్ రాపోల్ (వికెట్‌కీపర్‌)

ఇంగ్లండ్‌ పర్యటనలో భారత అండర్‌-19 జట్టు షెడ్యూల్‌..
జూన్‌ 24- 50 ఓవర్ల వార్మప్‌ మ్యాచ్‌ (లోగ్‌బరో యూనివర్శిటీ)

జూన్‌ 27- తొలి వన్డే (హోవ్‌)
జూన్‌ 30- రెండో వన్డే (నార్తంప్టన్‌)
జులై 2- మూడో వన్డే (నార్తంప్టన్‌)
జులై 5- నాలుగో వన్డే (వార్సెస్టర్‌)
జులై 7- ఐదో వన్డే (వార్సెస్టర్‌)

జులై 12-15: తొలి మల్టీ డే మ్యాచ్‌ (బెకెన్హమ్‌)
జులై 20-23: రెండో మల్టీ డే మ్యాచ్‌ (చెమ్స్‌ఫోర్డ్‌)

 

 

 

 


Videos

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

బస్సును ముద్దాడిండు డ్రైవరన్న

ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు భార్య కుట్ర

అవి వాళ్ళు రాస్తే వచ్చే మార్కులు కాదు.. SGT ప్రభాకర్ కు ఉద్యోగం ఎలా ఇచ్చారంటే

ఇంకెన్నాళ్లు నీ కొడుకును కాపాడుకుంటావ్.. వైఎస్ జగన్ సెన్సేషనల్ కామెంట్స్

ఒక రోజుకు 80 లక్షలు... ఎవడబ్బ సొమ్మని ఖర్చు పెడుతున్నారు..!

చైనా వేదికపై ఫేక్ మేయర్ ప్రచారం?

కొండా రెడ్డి బురుజు సాక్షిగా దొరికిన బడి దొంగలు

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)