Breaking News

టీమిండియాతో వన్డే సిరీస్‌.. శ్రీలంకకు భారీ షాక్‌! యార్కర్ల కింగ్‌ ఔట్‌

Published on Thu, 08/01/2024 - 11:17

టీమిండియాతో వ‌న్డే సిరీస్‌కు ముందు శ్రీలంక‌కు గ‌ట్టి ఎదరు దెబ్బ త‌గిలింది. ఆ జ‌ట్టు స్టార్ పేస‌ర్ మ‌తీషా ప‌తిరాన గాయం కార‌ణంగా భారత్‌తో వ‌న్డే సిరీస్‌కు దూర‌మ‌య్యాడు. టీమిండియాతో జ‌రిగిన మూడో టీ20లో ప‌తిరాన గాయ‌ప‌డ్డాడు. ప‌ల్లెకెలె వేదిక‌గా జ‌రిగిన ఆఖ‌రి టీ20లో బంతిని ఆపే క్ర‌మంలో ప‌తిరాన భుజానికి గాయ‌మైంది.

వెంట‌నే అతడు మైదానాన్ని విడిచి వెళ్లాడు. అయితే అత‌డి గాయం తీవ్ర‌మైన‌ది కావ‌డంతో రెండు వారాల విశ్రాంతి అవ‌స‌ర‌మ‌ని వైద్యులు సూచించ‌న‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలో ప‌తిరాన భార‌త్‌తో వ‌న్డే సిరీస్ నుంచి వైదొలిగాడు. అత‌డి స్ధానాన్ని యువ పేస‌ర్‌ మహ్మద్ షిరాజ్‌తో శ్రీలంక క్రికెట్ భ‌ర్తీ చేసింది.

కాగా టీ20 సిరీస్‌ను శ్రీలంక కోల్పోయిన‌ప్ప‌ట‌కి ప‌తిరాన మాత్రం అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. 5 వికెట్ల‌తో శ్రీలంక త‌ర‌పున లీడింగ్ వికెట్ టేక‌ర్‌గా నిలిచాడు. ఇక మ‌హ్మ‌ద్ సిరాజ్ విషయానికి వ‌స్తే.. డిమాస్టిక్ క్రికెట్‌లో అత‌డికి మంచి రికార్డు ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు 47 లిస్ట్‌-ఎ మ్యాచ్‌లు ఆడిన షిరాజ్‌.. 80 వికెట్లు ప‌డ‌గొట్టాడు. కాగా ఆగ‌స్టు 2 నుంచి భార‌త్‌-శ్రీలంక మ‌ధ్య మూడు వ‌న్డేల సిరీస్ ఆరంభం కానుంది.

భారత్‌తో వన్డే సిరీస్‌కు లంక జట్టు: చరిత్ అసలంక (కెప్టెన్‌), పాతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, కుసల్ మెండిస్, సదీర సమరవిక్రమ, కమిందు మెండిస్, జనిత్ లియానాగే, నిషాన్ మదుష్క, వనిందు హసరంగా, దునిత్ వెల్లలగే, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, అకిల దనంజయ, దిల్షన్ మదుశంక, షిరాజ్‌, అసిత ఫెర్నాండో
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)