శ్రీలంకతో మూడో టీ20.. రీఎంట్రీ ఇచ్చిన స్టార్‌ ప్లేయర్లు

Published on Fri, 12/26/2025 - 18:55

స్వదేశంలో భారత మహిళల క్రికెట్‌ జట్టు శ్రీలంకతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు పూర్తి కాగా.. రెంటిలో టీమిండియానే గెలిచింది. విశాఖ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌ల్లో భారత్‌ ఏకపక్ష విజయాలు సాధించింది. తొలి టీ20లో 8 వికెట్లు, రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో భారత జట్టు ఘన విజయాలు నమోదు చేసింది.

సిరీస్‌లో భాగంగా ఇవాళ (డిసెంబర్‌ 26) మూడో టీ20 జరుగనుంది. తిరువనంతపురం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ భారత జట్టే టాస్‌ గెలిచింది. 

మూడో టీ20 కోసం భారత జట్టు రెండు మార్పులు చేసింది. స్టార్‌ ప్లేయర్లు రేణుకా సింగ్‌, దీప్తి శర్మ రీఎంట్రీ ఇచ్చారు. దీంతో స్నేహ్‌ రాణా, అరుంధతి రెడ్డి బెంచ్‌కు పరిమితమయ్యారు. మరోవైపు ఈ మ్యాచ్‌ కోసం శ్రీలంక ఏకంగా మూడు మార్పులు చేసింది. 

0-2తో వెనుకపడిపోయిన శ్రీలంక సిరీస్‌లో సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి. ఒకవేళ ఈ మ్యాచ్‌లో కూడా భారతే గెలిస్తే, మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సిరీస్‌ వశమవుతుంది.

తుది జట్లు..
శ్రీలంక: చమరి అతపత్తు(సి), హాసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, నిమేషా మదుషాని, కవిషా దిల్హరి, నీలక్షికా సిల్వా, ఇమేషా దులాని, కౌషని నుత్యంగన(w), మల్షా షెహాని, ఇనోకా రణవీర, మల్కీ మదర

భారత్‌: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (సి), రిచా ఘోష్ (w), దీప్తి శర్మ, అమంజోత్ కౌర్, వైష్ణవి శర్మ, క్రాంతి గౌడ్, రేణుకా సింగ్ ఠాకూర్, శ్రీ చరణి
 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)