Breaking News

టీమిండియాలోకి అరంగేట్రం చేసిన తెలుగు క్రికెటర్‌

Published on Wed, 06/19/2024 - 14:44

హైదరాబాద్‌కు చెందిన మహిళా క్రికెటర్‌, తెలుగు అమ్మాయి అరుంధతి రెడ్డి టీమిండియాలోకి అరంగేట్రం చేసింది. మహిళల ఐసీసీ వన్డే ఛాంపియన్‌షిప్‌లో భాగంగా సౌతాఫ్రికాతో ఇవాళ (జూన్‌ 19) జరుగుతున్న మ్యాచ్‌తో అరుంధతి వన్డే ఫార్మాట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. టీమిండియా వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధన అరుంధతికి క్యాప్‌ అందించి టీమ్‌లోకి ఆహ్వానించింది. 2018లోనే టీ20 ఫార్మాట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన 26 ఏళ్ల అరుంధతి.. దాదాపు మూడేళ్ల గ్యాప్‌ తర్వాత తిరిగి జాతీయ జట్టులో స్థానం దక్కించుకుంది. 

రైట్‌ ఆర్మ్‌ మీడియం ఫాస్ట్‌ బౌలర్‌, రైట్‌ హాండ్‌ బ్యాటర్‌ అయిన అరుంధతి.. తన చివరి టీ20 మ్యాచ్‌ను 2021లో ఆడింది. టీ20ల్లో 26 మ్యాచ్‌ల్లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన అరుంధతి 18 వికెట్లు తీసి, 73 పరుగులు చేసింది.  

కాగా, మూడు వన్డేలు, ఒక​ టెస్ట్‌, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ల కోసం సౌతాఫ్రికా మహిళల క్రికెట్‌ జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లలో తొలుత వన్డే సిరీస్‌ ప్రారంభమైంది. వన్డే సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా 143 పరుగుల భారీ తేడాతో గెలిచింది.

బెంగళూరు వేదికగా ఇవాళ జరుగుతున్న రెండో వన్డేలో సౌతాఫ్రికా జట్టు టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. సౌతాఫ్రికా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 17 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టానికి 53 పరుగులు చేసింది. 20 పరుగులు చేసి షఫాలీ వర్మ ఔట్‌ కాగా.. స్మృతి మంధన (19), దయాలన్‌ హేమలత (7) క్రీజ్‌లో ఉన్నారు. షఫాలీ వర్మ వికెట్‌ మ్లాబాకు దక్కింది.

తుది జట్లు..

భారత్: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, హేమలత, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, దీప్తి శర్మ, పూజ వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రాధ యాదవ్, అశా శోభన

దక్షిణాఫ్రికా: లారా వోల్వార్డ్ (కెప్టెన్), తజ్మిన్, అన్నెకే, సునే లూస్, మరిజన్నే, నాడిన్ డిక్లెర్క్, షాంగసె, మెయికే డిరిడ్డర్, మసాబట క్లాస్, మ్లాబా, అయబొంగ.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)