Breaking News

విధ్వంసం సృష్టించిన టీమిండియా కెప్టెన్‌.. వన్డేల్లో రెండో వేగవంతమైన శతకం

Published on Tue, 07/22/2025 - 21:05

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌ మహిళల క్రికెట్‌ జట్టుతో ఇవాళ (జులై 22) జరుగుతున్న నిర్ణయాత్మక చివరి వన్డేలో భారత మహిళా జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ చెలరేగిపోయింది. 

ఈ మ్యాచ్‌లో హర్మన్‌ కేవలం 82 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి, భారత్‌ తరఫున వన్డేల్లో రెండో వేగవంతమైన సెంచరీని నమోదు చేసింది. ఫలితంగా టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 318 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

ఈ మ్యాచ్‌లో మొత్తంగా 84 బంతులు ఎదుర్కొన్న హర్మన్‌ 14 ఫోర్ల సాయంతో 102  పరుగులు చేసి ఔటైంది. హర్మన్‌తో పాటు భారత ఇన్నింగ్స్‌లో జెమీమా రోడ్రిగెజ్‌ (50), స్మృతి మంధన (45), హర్లీన్‌ డియోల్‌ (45), రిచా ఘోష్‌ (38 నాటౌట్‌), ప్రతిక రావల్‌ (26) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. 

భారత బ్యాటర్ల ధాటికి ఈ మ్యాచ్‌లో ఇంగ్లీష్‌ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. సోఫీ ఎక్లెస్టోన్‌ (10-2-28-1) మినహా మిగతా బౌలర్లంతా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. లారెన్‌ బెల్‌ 10 ఓవర్లలో 82, లారెన్‌ ఫైలర్‌ 10 ఓవర్లలో 64, చార్లోట్‌ డీన్‌ 10 ఓవర్లలో 69, లిన్సే స్మిత్‌ 10 ఓవర్లలో 74 పరుగులు సమర్పించుకొని తలో వికెట్‌ తీశారు.

భారత్‌ తరఫున అత్యంత వేగవంతమైన వన్డే సెంచరీలు..
70 స్మృతి మంధన vs ఐర్లాండ్‌ రాజ్‌కోట్ 2025
82 హర్మన్‌ప్రీత్ కౌర్ vs ఇంగ్లాండ్ చెస్టర్-లీ-స్ట్రీట్ 2025
85 హర్మన్‌ప్రీత్ కౌర్ vs దక్షిణాఫ్రికా బెంగళూరు 2024
89 జెమిమా రోడ్రిగ్స్ vs దక్షిణాఫ్రికా కొలంబో RPS 2025

ఇదిలా ఉంటే, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ప్రస్తుతం ఇరు జట్లు తలో మ్యాచ్‌ గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకే సిరీస్‌ సొంతమవుతుంది. దీనికి ముందు ఇరు జట్ల మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జరగగా, భారత్ 3-2 తేడాతో ఆ సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)