IND VS AUS: మంధన మెరుపు శతకంతో చెలరేగినా..!

Published on Wed, 09/17/2025 - 18:09

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా మహిళల జట్టుతో ఇవాళ (సెప్టెంబర్‌ 17) జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితమైంది. ఓపెనర్‌ స్మృతి మంధన (91 బంతుల్లో 117; 14 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు శతకంతో చెలరేగినా భారత్‌ భారీ స్కోర్‌ చేయలేకపోయింది. చివరి వరుస బ్యాటర్లు విఫలం కావడంతో 49.5 ఓవర్లలో 292 పరుగులకే ఆలౌటైంది.

ఓ దశలో భారత్‌ 350కి పైగా స్కోర్‌ చేస్తుందేమో అనిపించింది. అయితే మంధన ఔటైన తర్వాత పరిస్థితి తారుమారైంది. దీప్తి శర్మ (40), రిచా ఘోష్‌ (29) కాసేపు పోరాడారు. ఆతర్వాత వచ్చిన రాధా యాదవ్‌ (6), అరుంధతి రెడ్డి (4), క్రాంతి గౌడ్‌ (2) స్వల్ప స్కోర్లకే ఔటయ్యారు. ఆఖర్లో స్నేహ్‌ రాణా (24) బ్యాట్‌ ఝులిపించిడంతో భారత్‌ 290 పరుగుల మార్కునైనా తాకగలిగింది.

అంతకుముందు టాపార్డర్‌ బ్యాటర్లు (మంధన మినహా) కూడా తడబడ్డారు. ఓపెనర్‌ ప్రతిక​ రావల్‌కు (25) మంచి ఆరంభం లభించినా భారీ స్కోర్‌గా మలచలేకపోయింది. వన్‌డౌన్‌ బ్యాటర్‌ హర్లీన్‌ డియోల్‌ (10), కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (17) కూడా తక్కువ స్కోర్లకే ఔటై నిరాశపరిచారు.

ఓ పక్క వికెట్లు పడుతున్నా మంధన ఏమాత్రం తగ్గకుండా ధాటిగా ఆడటం కొనసాగించింది. 32.2 ఓవర్లలో 192 పరుగుల వద్ద మంధన ఔట్‌ కావడంతో భారత్‌ స్కోర్‌ నెమ్మదించింది. మంధన ఔటయ్యాక భారత్‌ చివరి 6 వికెట్లు 53 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. మంధన దెబ్బకు తొలుత లయ కోల్పోయిన ఆసీస్‌ బౌలర్లు, ఆఖర్లో పుంజుకున్నారు.  

డార్సీ బ్రౌన్‌ 3, ఆష్లే గార్డ్‌నర్‌ 2, మెగాన్‌ షట్‌, అన్నాబెల్‌ సదర్‌ల్యాండ్‌, తహ్లియా మెక్‌గ్రాత్‌ తలో వికెట్‌ తీశారు. వీరిలో గార్డ్‌నర్‌ (10-1-39-2) పొదుపుగా బౌలింగ్‌ చేయడమే కాకుండా వికెట్లు తీయగలిగింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ కెప్టెన్‌ హీలీ ఏకంగా ఎనిమిది బౌలర్లను ప్రయోగించింది.

అనంతరం 293 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్‌కు రెండో ఓవర్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ జార్జియా వాల్‌ను రేణుకా సింగ్‌ డకౌట్‌ చేసింది. రేణుకా బౌలింగ్‌కు ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడిన వాల్‌ 5 బంతులు ఎదుర్కొన్న తర్వాత క్లీన్‌ బౌల్డ్‌ అయ్యింది. 

భారత్‌కు ఐదో ఓవర్‌ ఐదో బంతికి మరో బ్రేక్‌ లభించింది. మరో ఓపెనర్‌ అలైస్సా హీలీని (9) క్రాంతి గౌడ్‌ బోల్తా కొట్టించింది. దీంతో ఆసీస్‌ 5 ఓవర్లలో 12 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ గెలవాలంటే 45 ఓవర్లలో మరో 281 పరుగులు చేయాలి. కాగా, ఈ సిరీస్‌లోని తొలి వన్డేలో గెలిచి ఆసీస్‌ 1-0 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.

 

 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)