పొట్టి క్రికెట్‌లో పెను సంచలనం

Published on Thu, 04/25/2024 - 16:44

పొట్టి క్రికెట్‌లో పెను సంచలనం నమోదైంది. మహిళల టీ20ల్లో భాగంగా మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో ఇండోనేషియా బౌలర్‌ రొహ్మాలియా రొహ్మాలియా పరుగులేమీ ఇవ్వకుండా ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టింది. అంతర్జాతీయ టీ20ల్లో (పురుషులు, మహిళలు) ఇవే అత్యుత్తమ గణాంకాలు. ఐసీసీ గుర్తింపు పొందిన ఏ జట్టు తరఫున ఇలాంటి గణాంకాలు నమోదు కాలేదు.

పురుషుల క్రికెట్‌లో (టీ20ల్లో) అత్యుత్తమ గణాంకాలు స్యాజ్రుల్‌ ఇద్రుస్‌ (4-1-8-7) పేరిట ఉండగా.. మహిళల క్రికెట్‌లో రొహ్మాలియాకు ముందు ఈ రికార్డు నెదర్లాండ్స్‌ క్రికెటర్‌ ఫ్రెడ్రిక్‌ ఓవర్డిక్‌ (4-2-3-7) పేరిట ఉండింది. ప్రపంచ క్రికెట్‌లో ఇప్పటివరకు ఏ బౌలర్‌ పరుగులేమీ ఇవ్వకుండా 7 వికెట్లు తీసిన దాఖలాలు లేవు. రొహ్మాలియా తన కెరీర్‌లో రెండో టీ20 మ్యాచ్‌లోనే ఎవరికీ సాధ్యంకాని గణాంకాలు నమోదు చేయడం మరో విశేషం. 

మ్యాచ్‌ విషయానికొస్తే.. బాలీ బాష్‌గా పిలువబడే టోర్నీలో ఇండోనేషియా, మంగోలియా జట్లు తలపడ్డాయి. ఈ సిరీస్‌లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో రొహ్మాలియా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇండోనేషియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ఇండోనేషియా ఇన్నింగ్స్‌లో నందా సకారిని (61) అర్దసెంచరీతో రాణించింది. మంగోలియా బౌలర్లలో ఎంక్జుల్‌ 4 వికెట్లు పడగొట్టింది. 

 

 

152 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మంగోలియా.. రొహ్మాలియా (3.2-3-0-7) ధాటికి 16.2 ఓవర్లలో 24 పరుగులకే కుప్పకూలింది. మంగోలియా ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా కనీసం రెండంకెల మార్కు తాకలేకపోగా.. ఎక్స్‌ట్రాలు టాప్‌ స్కోర్‌ (10) కావడం విశేషం. మంగోలియా ఇన్నింగ్స్‌లో ఏకంగా ఆరుగురు డకౌట్లు అయ్యారు. 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)