Breaking News

వన్డే ప్రపంచ కప్‌ కోసం టీమిండియా ప్రకటన.. డ్యాషింగ్‌ బ్యాటర్‌కు దక్కని చోటు

Published on Tue, 08/19/2025 - 16:54

భారత్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న మహిళల వన్డే ప్రపంచకప్‌ కోసం​ 15 మంది సభ్యుల భారత జట్టును ఇవాళ (ఆగస్ట్‌ 19) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, వైస్‌ కెప్టెన్‌గా స్మృతి మంధన కొనసాగనున్నారు. యువ డాషింగ్‌ బ్యాటర్‌ షఫాలీ వర్మకు ఈ జట్టులో చోటు దక్కలేదు. 

గాయం కారణంగా చాలాకాలం ఆటకు దూరంగా ఉన్న పేసర్‌ రేణుకా ఠాకూర్‌ టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చింది. పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అమన్‌జోత్‌ కౌర్‌ కూడా ఈ జట్టులో చోటు దక్కించుకుంది. తేజల్ హసబ్నిస్ , ప్రేమ రావల్, ప్రియా మిశ్రా, ఉమా చెత్రీ, మిన్నూ మణి, సయాలీ సత్ఘరే స్టాండ్‌ బై ప్లేయర్లుగా ఎంపికయ్యారు. 

వరల్డ్‌కప్‌ టోర్నీ సెప్టెంబర్‌ 30న మొదలవుతుంది. ఓపెనింగ్‌ మ్యాచ్‌లో భారత్‌, శ్రీలంక తలపడనున్నాయి. అక్టోబర్‌ 5న భారత్‌, పాకిస్తాన్‌ మ్యాచ్‌ జరగాల్సి ఉంది. అక్టోబర్‌ 9న భారత్‌ సౌతాఫ్రికాతో తలపడుతుంది. అక్టోబర్‌ 12న ఆస్ట్రేలియా, అక్టోబర్‌ 19న ఇంగ్లండ్‌, అక్టోబర్‌ 23న న్యూజిలాండ్‌, అక్టోబర్‌ 26న బంగ్లాదేశ్‌తో టీమిండియా తలపడాల్సి ఉంది.

వన్డే ప్రపంచకప్‌-2025 కోసం భారత మహిళల క్రికెట్‌ జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), స్మృతి మంధాన (వైస్‌ కెప్టెన్‌), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్‌కీపర్‌), యాస్తికా భాటియా (వికెట్‌కీపర్‌), దీప్తి శర్మ, స్నేహ్‌ రాణా, అమన్‌జోత్‌ కౌర్‌, రాధా యాదవ్‌, శ్రీ చరణి, క్రాంతి గౌడ్‌, అరుంధతి రెడ్డి, రేణుకా ఠాకూర్‌

మెగా టోర్నీకి ముందు భారత్‌ స్వదేశంలో ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆడనుంది. ఈ సిరీస్‌లోని తొలి వన్డే సెప్టెంబర్‌ 14న, రెండో వన్డే 17న, మూడో వన్డే సెప్టెంబర్‌ 20న జరుగనున్నాయి. ఈ సిరీస్‌ కోసం ఒక్క మార్పు మినహా వరల్డ్‌కప్‌కు ప్రకటించిన జట్టునే కొనసాగించనున్నారు. ఆసీస్‌ సిరీస్‌లో అమన్‌జోత్‌ స్థానంలో సయాలీ సత్ఘరే ఆడనుంది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)