Breaking News

బూమ్‌ బూమ్‌ బుమ్రా

Published on Wed, 07/09/2025 - 00:23

లండన్‌: ఇంగ్లండ్‌తో మూడో టెస్టు కోసం భారత టాప్‌ పేస్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా సిద్ధమవుతున్నాడు. రేపటి నుంచి ప్రఖ్యాత లార్డ్స్‌ మైదానంలో ఈ మ్యాచ్‌ జరుగుతుంది. పని భారం కారణంగా ఈ సిరీస్‌లో మూడు టెస్టులే ఆడాలని నిర్ణయించుకున్న బుమ్రా బర్మింగ్‌హామ్‌లో జరిగిన రెండో టెస్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు తగినంత విరామం తర్వాత పూర్తి ఫిట్‌గా మ్యాచ్‌కు అతను సన్నద్ధమయ్యాడు. టెస్టుకు రెండు రోజుల ముందు మంగళవారం బుమ్రా సుదీర్ఘ సమయం పాటు నెట్స్‌లో శ్రమించాడు. విరామం లేకుండా అతను బౌలింగ్‌ ప్రాక్టీస్‌ చేశాడు. 

ఆప్షనల్‌ ప్రాక్టీస్‌ రోజు కావడంతో ప్రధాన బ్యాటర్లు గిల్, రాహుల్, జైస్వాల్, పంత్‌తో పాటు సుందర్, సిరాజ్, ఆకాశ్‌దీప్‌ కూడా మంగళవారం సాధన చేయలేదు. దాంతో కరుణ్‌ నాయర్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, ధ్రువ్‌ జురేల్‌లకు బుమ్రా బౌలింగ్‌ చేశాడు. వీరందరినీ తన బౌలింగ్‌తో బుమ్రా ఇబ్బంది పెట్టాడు. ఎలాంటి అసౌకర్యం లేకుండా పూర్తి రనప్‌తో అతను బౌలింగ్‌ చేశాడు. 

నెట్స్‌కు వచ్చీ రాగానే బౌలింగ్‌ కోచ్‌ మోర్నీ మోర్కెల్‌ను అడిగి తనకు కొత్త బంతి మాత్రమే కావాలని ఎంచుకున్న బుమ్రా దాంతో ప్రాక్టీస్‌ కొనసాగించాడు. 2021లో లార్డ్స్‌ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో రివర్స్‌ స్వింగ్‌తో మూడు కీలక వికెట్లు పడగొట్టిన బుమ్రా భారత్‌ ఘన విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ సారి లార్డ్స్‌ పిచ్‌ పేస్‌ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటుందని వినిపిస్తున్న నేపథ్యంలో అతను ఎలా చెలరేగుతాడనేది ఆసక్తికరం

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)