Breaking News

IND vs SA: సిరీస్ స‌మ‌మా? స‌మ‌ర్పణ‌మా?

Published on Tue, 11/18/2025 - 12:13

ఈడెన్ గార్డెన్స్‌.. భారత క్రికెట్ జట్టుకు కంచుకోట. ఈ ప్రతిష్టాత్మక మైదానంలో టీమిండియాను ఓడించాలంటే ప్రత్యర్ధి జట్టుకు కత్తి మీద సామే. అయితే ఈ ఐకానిక్ ‍గ్రౌండ్‌లో గత 13  ఏళ్లగా ఓటమి ఎరుగుని భారత జట్టును టెంబా బవుమా సారథ్యంలోని సౌతాఫ్రికా కంగు తినిపించింది. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన తొలి టెస్టులో 30 పరుగుల తేడాతో భారత్‌ను ప్రోటీస్ చిత్తు చేసింది. 

124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక మెన్ ఇన్‌ బ్లూ 93 పరుగుల వద్దే చతికిల పడింది. భారత బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0 తేడాతో వెన‌కంజ‌లో నిలిచింది. ఈ క్ర‌మంలో భార‌త జ‌ట్టు త‌మ త‌ప్పిదాల‌ను  స‌రిదిద్దుకోవాల్సిన స‌మ‌యం అసన్న‌మైంది.

భార‌త్‌కు 'డూ ఆర్ డై'
న‌వంబ‌ర్ 22 నుంచి గౌహ‌తిలోని బార్సాపరా స్టేడియం వేదిక‌గా ప్రోటీస్‌తో ప్రారంభం కానున్న రెండో టెస్టులో టీమిండియా త‌ల‌ప‌డనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను స‌మం చేయాల‌ని భార‌త జ‌ట్టు ప‌ట్టుద‌ల‌తో ఉంది. ఈ 'డూ ఆర్ డై' మ్యాచ్‌ కోసం భారత్‌ ప్రత్యేక వ్యూహాలు రచిస్తోంది.

ఎక్కడైతే ప్రోటీస్ బౌలర్లను ఎదుర్కొలేక భారత బ్యాటర్లు ఇబ్బంది పడ్డారో.. అక్కడే ప్రాక్టీస్‌ను మొదలు పెట్టారు. భారత జట్టు మంగళవారం ఈడెన్ గార్డెన్స్‌లో తమ తొలి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గోనుంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పర్యవేక్షణలో భారత ఆటగాళ్లు చమటోడ్చనున్నారు.  బ్యాటింగ్ ప్రాక్టీస్‌పై ఎక్కువగా దృష్టిసారించనున్నట్లు తెలుస్తోంది.

గిల్ దూరం..!
ఇక కీల‌క‌మైన రెండో టెస్టుకు భార‌త కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ దూర‌మ‌య్యే అవ‌కాశ‌ముంది. మెడ నొప్పి కార‌ణంగా తొలి టెస్టు నుంచి అర్ధాంతరంగా త‌ప్పుకొన్న గిల్‌.. ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అత‌డు పూర్తి ఫిట్‌నెస్ సాధించ‌డానికి నాలుగైదు రోజుల స‌మ‌యం ప‌ట్ట‌నుంది.

దీంతో గౌహతికి టెస్టుకు గిల్‌కు విశ్రాంతి ఇచ్చే అవ‌కాశ‌ముంది. ఒక‌వేళ ఇదే జ‌రిగితే అత‌డి స్ధానంలో సాయి సుద‌ర్శ‌న్ తుది జ‌ట్టులోకి రానున్నాడు. సుద‌ర్శ‌న్‌కు స్వ‌దేశంలో మంచి ట్రాక్ రికార్డు ఉంది. అత‌డి సేవ‌ల‌ను మిడిలార్డ‌ర్‌లో భార‌త్ ఉప‌యెగించుకోనుంది.

వాషింగ్ట‌న్‌పై వేటు..
ఈ మ్యాచ్‌లో భార‌త్ ప‌లు మార్పుల‌తో బ‌రిలోకి దిగే అవ‌కాశ‌ముంది. గౌహతి పిచ్‌ సాధారణంగా పేస్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. దీంతో ఈ మ్యాచ్‌లో ముగ్గురు పేస‌ర్లతో భార‌త్ ఆడ‌నున్న‌ట్లు స‌మాచారం. వాషింగ్ట‌న్ సుంద‌ర్‌పై మెనెజ్‌మెంట్ వేటు వేసేందుకు సిద్ద‌మైన‌ట్లు తెలుస్తోంది. గ‌త మ్యాచ్‌లో అత‌డు స్పెష‌లిస్ట్ బ్యాట‌ర్‌గా ఆడాడు. 

వాషీ రెండు ఇన్నింగ్స్‌లు క‌లిపి కేవ‌లం ఒక్క ఓవ‌ర్ మాత్ర‌మే బౌలింగ్ చేశాడు. కుల్దీప్ యాద‌వ్‌, అక్ష‌ర్ ప‌టేల్‌, ర‌వీంద్ర జ‌డేజాలు స్పిన్న‌ర్ల‌గా మెరుగ్గా రాణించారు. ఇప్పుడు సుంద‌ర్ స్ధానంలో ఫాస్ట్ బౌల‌ర్‌ ఆకాష్ దీప్‌ను ఆడించే యోచ‌న‌లో హెడ్‌కోచ్ గౌత‌మ్ గంభీర్ ఉన్నాడంట‌. 

భార‌త్‌కు బౌలింగ్‌కు ప‌రంగా ప్ర‌స్తుతం ఎటువంటి ఢోకా లేదు. స‌ఫారీల‌పై మ‌న బ్యాట‌ర్లే స‌త్తాచాటాల్సి ఉంది. అదేవిధంగా ఈ మ్యాచ్‌లో ఒకే వికెట్ కీప‌ర్‌తో భార‌త్ ఆడ‌నునున్న‌ట్లు స‌మాచారం. ధ్రువ్ జురెల్ స్ధానంలో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండ‌ర్ నితీశ్ కుమార్ రెడ్డిని జ‌ట్టులోకి తీసుకోనున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

జైశ్వాల్ ఫామ్ అందుకుంటాడా?
ఇక తొలి టెస్టులో పూర్తిగా విఫ‌ల‌మైన స్టార్ ఓపెన‌ర్ య‌శస్వి జైశ్వాల్ త‌న ఫామ్‌ను తిరిగి అందుకోవాల్సిన స‌మ‌యం అస‌న్న‌మైంది. దాదాపుగా ప్ర‌తీ టెస్టులోనూ జైశూ త‌న మెరుపు బ్యాటింగ్‌తో భార‌త్‌కు అద్భుత‌మైన శుభారంభం అందిస్తూ ఉంటాడు.

గ‌త మ్యాచ్‌లో అత‌డు త‌న బ్యాట్‌కు పని చెప్ప‌కోవ‌డంతో భార‌త్ ఘోర ప‌రాజ‌యం ఎదుర్కొంది. దీంతో అత‌డు కీల‌క‌మైన గౌహ‌తి టెస్టులో రాణించాల‌ని స‌గ‌టు భార‌త అభిమాని కోరుకుంటున్నాడు. అత‌డితో పాటు వైస్ కెప్టెన్ రిష‌బ్ పంత్ కూడా రాణించాల్సిన అవ‌స‌ర‌ముంది. ఒక‌వేళ గిల్ దూర‌మైతే పంత్‌నే జ‌ట్టును న‌డిపించ‌నున్నాడు.

రెండో టెస్టుకు భారత తుది జట్టు(అంచనా)
యశస్వి జైస్వాల్,  కేఎల్ రాహుల్,  సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రిషబ్ పంత్,ధృవ్ జురెల్, రవీంద్ర జడేజా, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)