Breaking News

‘షూటౌట్‌’లో గెలిచాం

Published on Thu, 02/26/2026 - 00:51

స్వదేశంలో గెలుపు ఖాతా తెరవడంలో విఫలమైన భారత పురుషుల హాకీ జట్టు విదేశీ గడ్డపై ఎట్టకేలకు గెలుపు బోణీ కొట్టింది. రెండో అంచె చివరి లీగ్‌ మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో నేరుగా కాకపోయినా ‘షూటౌట్‌’లో విజయాన్ని అందుకుంది. ప్రపంచ, ఒలింపిక్‌ మాజీ చాంపియన్‌ ఆ్రస్టేలియాను వారి గడ్డపైనే ‘షూటౌట్‌’లో ఓడించిన భారత జట్టు మూడో అంచె మ్యాచ్‌లను జూన్‌లో నెదర్లాండ్స్‌లో ఆడనుంది.  

హోబర్ట్‌: మొదటి ఐదు మ్యాచ్‌ల్లో నిర్ణీత సమయంలో పరాజయం... ఆ తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో ‘షూటౌట్‌’లో ఓటమి... ఎలాగైతేనేం వరుసగా ఏడు పరాజయాలు... కానీ ఎనిమిదో ప్రయత్నంలో భారత పురుషుల హాకీ జట్టు గెలుపు రుచి చూడటంలో సఫలమైంది. ఆ్రస్టేలియాలాంటి పటిష్ట జట్టును వారి గడ్డపైనే ‘షూటౌట్‌’లో ఓడించి రెండో అంచె లీగ్‌ను భారత జట్టు ముగించింది. బుధవారం జరిగిన ప్రొ లీగ్‌ ఎనిమిదో మ్యాచ్‌లో హార్దిక్‌ సింగ్‌ బృందం ‘షూటౌట్‌’లో 3–1 గోల్స్‌ తేడాతో ఆ్రస్టేలియాపై జట్టుపై గెలిచింది. భారత్‌కు రెండు పాయింట్లు, ఆ్రస్టేలియాకు ఒక పాయింట్‌ లభించాయి. 

నిర్ణీత సమయంలో రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్‌’ నిర్వహించగా... భారత్‌ తరఫున గోల్‌కీపర్‌ శశికుమార్‌ మోహిత్‌ హొన్నేణహళ్లి హీరోగా అవతరించాడు. ముగ్గురు ఆ్రస్టేలియా ఆటగాళ్ల షాట్‌లను మోహిత్‌ అడ్డుకొని భారత్‌ను గెలిపించాడు. భారత్‌ తరఫున ‘షూటౌట్‌’లో శిలానంద్‌ లాక్రా, మణీందర్‌ సింగ్, విష్ణుకాంత్‌ సింగ్‌ సఫలంకాగా... అభిషేక్‌ విఫలమయ్యాడు. ఆ్రస్టేలియా తరఫున మొదటి మూడు షాట్‌లు తీసుకున్న టిమ్‌ బ్రాండ్, లియామ్‌ హెండర్సన్, కూపర్‌ బర్న్స్‌ విఫలమవ్వగా... నాలుగో షాట్‌లో జెరెమీ హేవార్డ్‌ సఫలమయ్యాడు. 

అంతకుముందు రెగ్యులర్‌ సమయంలోని మూడు క్వార్టర్స్‌లో రెండు జట్లు గోల్స్‌ చేయలేకపోయాయి. చివరి క్వార్టర్‌లోని 49వ నిమిషంలో జెరెమీ హేవార్డ్‌ పెనాల్టీ కార్నర్‌ను లక్ష్యానికి చేర్చాడు. దాంతో ఆ్రస్టేలియా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఆ ఆనందం రెండు నిమిషాల్లో ఆవిరైంది. 51వ నిమిషంలో భారత ఫార్వర్డ్‌ శిలానంద్‌ లాక్రా గోల్‌ చేసి స్కోరును 1–1తో సమం చేశాడు. చివరి తొమ్మిది నిమిషాల్లో ఇరు జట్ల ఆటగాళ్లు మరో గోల్‌ చేయడానికి ప్రయత్నించి సఫలం కాలేకపోయారు. మ్యాచ్‌ మొత్తంలో భారత జట్టు తమకు లభించిన ఐదు పెనాల్టీ కార్నర్‌లను వృథా చేసింది. 

ఆ్రస్టేలియా తమకు దక్కిన ఏడు పెనాల్టీ కార్నర్‌లలో ఒక దానిని సద్వినియోగం చేసుంది. జూన్‌ 14 నుంచి 21 వరకు రోటర్‌డామ్‌లో మూడో అంచె మ్యాచ్‌లు జరుగుతాయి. భారత జట్టు జూన్‌ 14న నెదర్లాండ్స్‌తో... 17న జర్మనీతో... 18న మళ్లీ జర్మనీతో... 21న మళ్లీ నెదర్లాండ్స్‌తో ఆడుతుంది. అనంతరం 23 నుంచి 28 వరకు లండన్‌లో నాలుగో అంచె మ్యాచ్‌లు జరుగుతాయి. భారత జట్టు జూన్‌ 23న పాకిస్తాన్‌తో... 25న ఇంగ్లండ్‌తో... 26న మళ్లీ పాకిస్తాన్‌తో... 28న మళ్లీ ఇంగ్లండ్‌తో తలపడుతుంది.   

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)