‘వారిని ఓడించడం అంత సులువు కాదు’

Published on Wed, 07/22/2026 - 03:35

హరారే: ఐర్లాండ్, ఇంగ్లండ్‌ల చేతుల్లో టి20 సిరీస్‌లు ఓడిపోయిన తర్వాత భారత జట్టు ఇప్పుడు ఈ ఫార్మాట్‌తో మరో పోరుకు సిద్ధమైంది. మూడు టి20ల సిరీస్‌లో భాగంగా రేపు భారత్, జింబాబ్వే మధ్య తొలి మ్యాచ్‌ జరుగుతుంది. 

అయితే ఇటీవల ప్రదర్శనను మరచి కొత్త ఉత్సాహంతో తాము బరిలోకి దిగుతున్నామని భారత జట్టు వైస్‌ కెప్టెన్ తిలక్‌ వర్మ వ్యాఖ్యానించాడు. ‘జింబాబ్వే చాలా మంచి జట్టు. ఎంతో పోటీతత్వంతో పోరాడుతుంది. వారిని ఓడించడం అంత సులువు కాదు. 

గత ఏడాది జింబాబ్వేతో ఆడిన సిరీస్‌లో తొలి మ్యాచ్‌ వారే నెగ్గారు. నాటి భారత టీమ్‌లో ఉన్నవారిలో చాలా మంది ఇప్పుడూ వచ్చారు. మంచి పిచ్‌లతో బ్యాటింగ్‌కు అనుకూల పరిస్థితులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. 

గతంలో జింబాబ్వే గడ్డపై ఆడిన అనుభవం పనికొస్తుంది’ అని తిలక్‌ అన్నాడు. ఐర్లాండ్‌–ఇంగ్లండ్‌ల చేతుల్లో ఓటమికి పలు కారణాలు ఉన్నాయని, వాటిని విశ్లేషించుకున్నామని.. తాను మరింత బాధ్యతగా ఆడాల్సి ఉందని చెప్పాడు.

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)